Homeమహబూబ్‌నగర్‌Diwali Greetings | చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి

Diwali Greetings | చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి

  • ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి
  • తెలంగాణ ప్రజలకు,కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
  • బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్– జైపాల్ యాదవ్

కడ్తాల్‌: చెడుపై మంచి సాధించిన విజయానికి,చీకటిపై వెలుగు సాధించిన ఆధిపత్యానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి(Diwali Greetings) ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ జైపాల్ యాదవ్ ఆకాంక్షించారు.దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు,కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.దీపావళి పండుగ ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

జీవితాల్లో ఎదురయ్యే చీకట్లను తొలగించుకొని ఆశావహ దృక్పథంతో ముందుకు సాగేందుకు దీపావళి పండుగ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.ప్రజలందరికీ ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు,సిరిసంపదలు కలగాలని,ప్రతి ఒక్కరి జీవితాల్లో అభివృద్ధి, సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.రాష్ట్ర ప్రజల మధ్య ప్రేమాభిమానాలు,ఐక్యత,సోదరభావం మరింత బలపడాలని,కల్వకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ప్రజలందరూ కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని జైపాల్ యాదవ్ తన పండుగ సందేశంలో పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News