- అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హోంగార్డు.
- బాలకృష్ణ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం.
చివ్వెంల: విధి నిర్వహణలోనే కాకుండా సహోద్యోగులు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అండగా నిలుస్తూ(Financial Support) సూర్యాపేట జిల్లా పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. చివ్వెంల పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్లోని గ్లెనీగిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ నరసింహ పిలుపు మేరకు పోలీసు సిబ్బంది ఒక కుటుంబంలా ఏకమై రూ.లక్ష నగదును సేకరించారు. ఈ మొత్తాన్ని చివ్వెంల ఎస్సై మహేశ్వర్ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు అందజేశారు. సహోద్యోగి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడం పోలీసు కుటుంబంలోని ఐక్యత, మానవత్వానికి నిదర్శనమని ఎస్పీ నరసింహ, పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు రమేష్, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
