Homeసాహిత్యంHuman Life | పరిపూర్ణత

Human Life | పరిపూర్ణత

చెరుకు గడకు తీయ్యదనాన్నిచ్చి..
పూలను ఇవ్వడం మరిచాడు
బంగారానికి తళతళ మెరుపులిచ్చి.
సువాసనను ఇవ్వడం మరిచాడు
చందనానికి సువాసన ఇచ్చి..
పువ్వు లాంటి అందం ఇవ్వలేదు
కమలానికి అందానిచ్చి..
బురదలోనే ఆడుకొమ్మన్నాడు
సముద్రానికి లోతునిచ్చి..
జలానికి తీపి ఇవ్వడం మరిచాడు
నదీ జలానికి తియ్యదనాన్ని ఇచ్చి..
నిలకడ ఇవ్వడం మరిచాడు
వెలుగులు నింపే సూర్యుడికి..
చల్లదనాన్ని ఇవ్వడం మరిచాడు
చల్లదనాన్నిచ్చే చందమామకు..
వెలుగులు నింపే శక్తిని దూరం చేశాడుHuman Life
మనిషి కూడా అంతే కదా..
ఒకటి ఉంటే మరొకటి ఉండదు
ఏ వ్యక్తికి పరిపూర్ణత ఇవ్వలేదు
నీ బలహినతలను గమనించు..
బలాలుగా మార్చడానికి ప్రయత్నించు
ఏదో ఒక రోజు ‘ఫర్‌ఫెక్ట్‌’ కాకపోయినా..
‘ఎక్స్‌ట్రార్డినిరీ’ వ్యక్తిగా పేరు పొందగలవు !(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News