Homeవరంగల్‌Police Raid Illegal Gudumba|అక్రమ గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు..

Police Raid Illegal Gudumba|అక్రమ గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు..

–20 లీటర్ల గుడుంబా స్వాధీనం, 4,000 బెల్లం పానకం ధ్వంసం…Police Raid Illegal Gudumba

వెంకటాపురం మండల పరిధిలోని సుడిబాక అటవీ ప్రాంతం, (Police Raid Illegal Gudumba) బెస్తగూడెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న నిషేధిత గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలతో కలిసి శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా తయారీ స్థావరాలను ధ్వంసం చేసి, అక్కడ లభించిన 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, సుమారు 4,000 లీటర్ల బెల్లం పానకమును ధ్వంసం చేశారు.

- Advertisement -
Illegal Gudumba 1

అక్రమ గుడుంబా తయారీ స్థావరాలను నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించి వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో సీఆర్‌పీఎఫ్ 39వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ ప్రశస్త్, ఎస్ఐ తిరుపతిరెడ్డి, వెంకటాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, 39 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.అక్రమ గుడుంబా తయారీ, విక్రయం, సరఫరాకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం ఎస్ఐ తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన గుడుంబా తయారీ, విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు.

వెంకటాపురం మండల ప్రజలకు విజ్ఞప్తి:
మీ గ్రామాలలో ఎక్కడైనా అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయం లేదా సరఫరా జరుగుతున్నట్లు సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వెంకటాపురం ఎస్ఐ తెలిపారు.
సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్: 8712670098 అని తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News