- ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా..collector Bhavesh mishra
ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన ఔషధాలను వైద్య విధాన పరిషత్ భవనంలో నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (collector Bhavesh mishra)అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వైద్య విధాన పరిషత్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వైద్య కళాశాల అనాటమీ విభాగంలో నిల్వ ఉంచిన ఔషధాలను అవసరాలకు అనుగుణంగా టీవీవీపీ భవనానికి తరలించాలని సూచించారు. ఔషధాల అవసరం, ప్రాధాన్యత ఆధారంగా క్రమబద్ధంగా నిల్వ చేయాలని, వాటి సరఫరా, నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని ఆదేశించారు.
ఔషధాలు పాడవకుండా సురక్షితమైన ప్రదేశంలో భద్రపరచాలని, నిల్వ కేంద్రానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, డీసీహెచ్ఎస్ కాశీనాథ్, అధికారులు సౌమ్య, వంశీ మాధవ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
