HomeతెలంగాణAyyappa Society illegal constructions | అయ్యప్ప సొసైటీ ఆగడాలను కట్టడి చెయ్యాలి..

Ayyappa Society illegal constructions | అయ్యప్ప సొసైటీ ఆగడాలను కట్టడి చెయ్యాలి..

  • డిమాండ్ చేసిన టి.ఆర్.ఎస్. అధినేత్రి కవిత..Ayyappa Society illegal constructions
  • నెలరోజులు గడువు ఇచ్చిన వైనం..
  • లేదంటే రెడ్ మార్క్ వేస్తామని హెచ్చరిక..

హైదరాబాద్‌లోని ఖానామెట్ (Ayyappa Society illegal constructions) అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నామని, లేదంటే తమ పార్టీ కార్యకర్తలే అక్రమ కట్టడాలకు ‘రెడ్ మార్క్’ వేస్తారని హెచ్చరించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యప్ప సొసైటీలో సుమారు 750 అక్రమ నిర్మాణాలు జరిగాయని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులే దగ్గరుండి పర్మిషన్లు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములు, టీడీఆర్ అక్రమ దందాలు తప్ప సీఎం రేవంత్‌కు మరేమీ కనిపించడం లేదని ఆమె విమర్శించారు. ఈ వ్యవహారంలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

- Advertisement -

అయ్యప్ప సొసైటీలో రిజిస్ట్రేషన్లు జరగవని, అక్కడ ఇళ్లు కొనుగోలు చేసి ప్రజలు నష్టపోవద్దని కవిత సూచించారు. గురుకుల ట్రస్ట్ భూములపై గతంలో తాము ఎన్నో ఉద్యమాలు చేశామని గుర్తుచేశారు. ఇదే సొసైటీలో నారాయణ, చైతన్య వంటి విద్యాసంస్థలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపైనా కవిత స్పందిస్తూ, ఆయన కేవలం రాజకీయాలు మాట్లాడి వెళ్లారని, రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై స్పందించలేదని విమర్శించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News