- గిర్నిబావి(Girnibavi) లోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తిని ధ్వంసం చేస్తే కేసు ఎందుకు నమోదు కాదు..?
- పాఠశాల వెనుక భాగంలో ఉన్న 2017 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్ని బోగస్సేనా..?
- రౌడీగా వ్యవహరిస్తూ ముఠాను ఏర్పరుచుకొని..ఏ ధైర్యంతో కబ్జాలకు పాల్పడుతున్నాడు
- దుగ్గొండి మండల పోలీస్ స్టేషన్ లో గతంలో తోకల శ్రీనివాస్ రెడ్డి ముఠా పై భూ కబ్జా కేసు నమోదైన మారని బుద్ధి..
- అమాయకుల ప్లాట్లను, జ్యోతి రావు పూలే పాఠశాల స్థలాన్ని కబ్జా చేయడం ట్రెస్ పాస్ కాదా..
- తండ్రి అమ్ముకున్న భూములు కొన్నవాళ్ళు లే అవుట్ చేశారు..
- ఆ భూమిలో ప్లాట్లను అమాయక ప్రజలు కొన్నారు..
- నేడు ఆ ప్లాట్ల స్థలాన్ని కబ్జాలు చేస్తామంటే ఎలా..?
- ఇదే తరహాలో దుగ్గొండి మండలంలో తండ్రులు అమ్ముకున్న భూములు కొడుకులకు మళ్ళీ ఇస్తారా..?
- తోకల శ్రీనివాస్ రెడ్డి ముఠా కబ్జాల పై ఏసీబీ, విజిలెన్స్ జరపాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్..
- కాంగ్రెస్ పార్టీ లో లీడర్ గా చెలామణి అవుతూ కబ్జాలు చేయడంపై మండి పడుతున్నారు స్వంత పార్టీ నాయకులు..
- జిల్లా పంచాయతీ అధికారి స్పందించి అక్రమంగా వేసిన కనీలను తొలగించేలా చర్యలు చేపట్టాలి..
- రౌడీ లాగా వ్యవహరిస్తూన్న శ్రీనివాస్ రెడ్డిపై వీరి ముఠా పై ల్యాండ్ గ్రాబింగ్ కేసుతో పాటు రౌడీ షీట్ కేసు నమోదు చేయాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్..
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయా..? చట్టబద్ధంగా భూములు,ప్లాట్లు కొనుగోలు చేసి, తమ జీవితకాల కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టిన సామాన్యులు ఇప్పుడు తమ ప్లాట్ల రక్షణ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలో(Girnibavi) వెలుగులోకి వచ్చిన భూ కబ్జాల వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల స్థలం తో పాటు వెనుక భాగంలోని ప్లాట్ల స్థలాల విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు, భూముల యాజమాన్య హక్కులు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తుల పరిరక్షణపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

పాఠశాల వెనుక స్థలంలో ఏం జరుగుతోంది? : గిర్నిబావిలో పాఠశాల వెనుక ఉన్న స్థలంలో గతంలో ఏర్పాటు చేసిన హద్దులుగా ఉన్న కనీలను తొలగించి, ట్రాక్టర్లతో భూమిని చదును చేసి, రాళ్లు పాతినట్లు స్థానికులు, బాధిత ప్లాట్ల యజమానులు ఆరోపిస్తున్నారు.. ఈ వ్యవహారంలో తోకల శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరుల పాత్రపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తు న్నారు.. సదరు లే అవుట్లో ప్రైవేటు వ్యక్తుల పేరిట 2017 డాక్యుమెంట్లు రిజి స్ట్రేషన్ జరిగా యని ఈసీ స్పష్టం చేస్తుంది..
గ్రామ పంచాయతీ వెనుక భాగంలో అక్ర మంగా పాతిన కనీ లను తక్షణమే పంచా యతీరాజ్ చట్ట నిబం ధనల ప్రకారం తొల గించాలని డిమాండ్లు సైతం వెలువెత్తుతున్నాయి.. తమ వద్ద చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నప్పటికీ, తోకల శ్రీనివాస్ రెడ్డి ముఠా చేస్తున్న కబ్జాలకు తమ ప్లాట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని బాధితులు చెబుతున్నారు.. జ్యోతిరావు పూలే పాఠశాల స్థలంతో పాటు, తాము కొనుగోలు చేసిన ప్లాట్లను ఆక్రమించి, హద్దులు మార్చి, అనంతరం ఇతరులకు విక్రయించే ప్రయత్నాలు జరుగుతు న్నాయన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు..

గతంలో ఇదే భూమి విషయంపై కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే నాటి వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాటి ఆర్డిఓ పంచాయతీల శాఖ అధికారులు తహసిల్దార్ పోలీస్ అధికారులు విచారణ జరిపి తోకల శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ముటాపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు 35/2021 గా నమోదయిందని తెలిపారు.. ఎలాంటి ఉద్యోగం లేకుండా రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ కాసులకు కక్కుర్తి పడి అమాయకుల ప్లాట్లను జ్యోతిరావు పూలే పాఠశాల స్థలాన్ని కబ్జాలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడు తోకల శ్రీనివాసరెడ్డి అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి..
చేస్తున్న కబ్జాలను చూస్తూ ఉంటే వారి ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతుంది.. తనకున్న రాజకీయ పలుకుబడితో చిరుస్థాయి అధికారులను బెదిరింపులకు పాల్పడుతూ తాను చేస్తున్న కబ్జాలకు వత్తాసు పలకాలని ఒత్తిడి లకు గురి చేస్తున్నారని తెలిసింది.. తోకల శ్రీనివాస్ రెడ్డి పేరు ఎత్తితే చాలు మొత్తం ఇదే పనిలో పడ్డాడు ఆయన అనే మాటలే తప్ప తను రాజకీయ నాయకుడు అని ప్రాథమిక స్థాయిలో ఉన్న ఏ అధికారి మాట్లాడకపోవడం నేడు చర్చనీయాంశంగా మారింది.. సొంత పార్టీ నేతలే తోకల శ్రీనివాస్ రెడ్డి కబ్జాలకు కట్టడి చేయాలే తప్ప.. వేరే మార్గం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే పార్టీ పేరు బదనమయ్యే అవకాశం ఉందని సొంత పార్టీ నాయకులు సైతం ఆరోపిస్తున్నారు..
ఇదంతా ఒక ఎత్తైతే బుద్ధి సదానందం అనే వ్యక్తికి కోర్టు ఆదేశాలున్నా.. రిజిస్ట్రేషన్ చట్టంలో సదరు వ్యక్తికి అనుకూలంగా నిశిద్ధ జాబితాలో పెట్టిన అవన్నీ లెక్కచేయకుండా అమాయకుల ప్లాట్లను బుద్ధి సదానందం సంబంధించిన స్థలాన్ని యదేచ్ఛగా కబ్జాలు చేయడంలో దిట్టగా మారాడు అని వారు ఆరోపిస్తున్నారు.. ఇతనికి చట్టాలతో పనిలేదని కేవలం తెల్లచొక్కా వేసుకొని నేను లీడర్ ని నాకు అడ్డు వస్తే ఏదైనా చేస్తా అధికారులంతా నా గుప్పెట్లో ఉన్నారని బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.. దర్జాగా కబ్జాలు చేసి అమాయక ప్రజలకు ప్లాట్ల రూపంలో అమ్మి సబ్ రిజిస్టర్ ను మేనేజ్ చేసుకొని దారిలో రిజిస్ట్రేషన్ చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాడు తోకల శ్రీనివాస్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు..

ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండానే మీరు నేరుగా నిర్మాణాలు చేసుకోవచ్చు అధికారులను నేను మేనేజ్ చేస్తా అనే భరోసానిస్తూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపణ సైతం బలంగా వినిపిస్తుంది..రౌడీలాగా వ్యవహరిస్తూ ముఠాను వెనకేసుకొని సీనియర్ సిటిజన్ తో పాటు మహిళలను కూడా భయభ్రాంతుల గురిచేస్తూ పట్టపగలే కబ్జాలు చేయడం తోకల శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు అట్టే అర్థమవుతుంది..
ఇప్పటికైనా వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ స్పందించి తోకల శ్రీనివాస్ రెడ్డి అనే కబ్జాదారుడిపై ఇతడు ముఠాపై చేస్తున్న కబ్జాలపై విచారణ జరిపి గతంలో నమోదైన ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు అయిన కబ్జాలు చేయడం మానకపోవడం పై విజిలెన్స్ అండ్ ఏసీబీ అధికారులతోటి విచారణ జరిపించి రౌడీ లాగా వివరిస్తున్న వీరిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.. పంచాయతీరాజ్ చట్టాన్ని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా పాతిన కనీలను తక్షణమే జిల్లా పంచాయతీ శాఖ అధికారి తొలగించే విధంగా చర్యలు చేపట్టాలనే డిమాండ్ల సైతం వెలువెత్తుతున్నాయి..
గతంలో గాని ప్రస్తుతం గాని రిజిస్ట్రేషన్ చట్టంలో ఈసీనీ పరిశీలించిన, ధరణి రికార్డులో కానీ నేడు భూభారతి రికార్డులో గానీ పరిశీలించిన ఎక్కడా కూడా ఈ కబ్జాదారుల పేరుపైన భూమి లేకపోవడం వీరు చేస్తుంది ముమ్మాటికి కబ్జానేనని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.. ఇదే కాకుండా గ్రామంలో ఉన్న బతుకమ్మ కుంట చెరువుల సైతం రాత్రి వేళలో తన అనుచర వర్గంతో తోకల శ్రీనివాస్ రెడ్డి కూడిపించి కబ్జాలకు తెరలేపుతున్నాడని ఆరోపణ సైతం వినిపిస్తుంది.. తోకల శ్రీనివాస్ రెడ్డి ఇతని ముఠాతో కలిసి చేసిన కబ్జాలు చేస్తున్న అక్రమాలకు సంబంధించి మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా మీముందుకు రానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
