- ఎల్ నీనో ప్రభావంతో తాగునీటి సరఫరాకు అంతరాయం..(Mission Bhagiratha)
- ఈ శాఖలో భారీ ఎత్తున ఖాళీలు..
- సంబంధిత పోస్టులను వెంటనే భర్తీ చేయాలి..(Mission Bhagiratha)
రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గి (Mission Bhagiratha), తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనికి తోడు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న మిషన్ భగీరథకు శాఖాపరమైన సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ శాఖలో చీఫ్ ఇంజినీర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. నియామకాలపై దృష్టి సారించకపోవడం, ఉన్న సిబ్బందిపై అదనపు బాధ్యతల భారం మోపడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అధికారులు, సిబ్బందిని ఆందోళన కలిగిస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత గ్రామీణ నీటి సరఫరా శాఖ పేరును దాని పేరిట మార్చారు. ఈ శాఖలో ఆది నుంచే పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. మూడేళ్ల కిందట 250 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను నియమించారు. అయినా ఇంకా 180 ఏఈఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. శాఖలో తొమ్మిది చీఫ్ ఇంజినీర్ పోస్టుల్లో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఈఎన్సీ పదవి నుంచి విరమణ పొందిన కృపాకర్ రెడ్డి ఇప్పటికీ కొనసాగుతున్నారు. 78 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల్లో విధుల్లో ఉన్నది 33 మంది మాత్రమే. అలాగే 15 డివిజనల్ ఇంజినీర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది.
శాఖలో చాలా కాలంగా డీపీసీలు ఏర్పాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉన్న అధికారులకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తోంది. ప్రధాన కార్యాలయంలో ఉన్న ఐదుగురు చీఫ్ ఇంజినీర్లకు అదనపు బాధ్యతల కింద జిల్లా సర్కిళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో పాటు 50 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు సైతం అదనంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మిషన్ భగీరథ ప్రయోగశాలల్లో, క్షేత్రస్థాయిలో సూపర్వైజర్లు, వాటర్మెన్లు, ఇతర సిబ్బందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించి పనులు చేయిస్తున్నారు.
ఈ ఏడాది వర్షాకాలం తగినంత వానలు కురవకపోవడంతో మిషన్ భగీరథకు ప్రధాన నీటి వనరులైన 34 రిజర్వాయర్లలో నీటి కొరత ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్కడా కొరతలు ఏర్పడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అత్యవసర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
