- రైతులకు పరిహారం.. కరువు మండలాల ప్రకటనపై పట్టుబట్టనున్న కమలం పార్టీ
హైదరాబాద్: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, తీవ్రతరమవుతున్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి బీజేపీ ప్రతినిధి బృందం హాజరుకానుంది. అక్టోబర్ 28న సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య పాల్గొననున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆదేశాల మేరకు వారు పార్టీ వైఖరిని వినిపించనున్నారు.
రాష్ట్రంలో సాగునీటి ఎద్దడి, విద్యుత్ కోతలు, పంట నష్టాలు, తాగునీటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేయనుంది. కరువు ప్రభావిత ప్రాంతాలను వెంటనే అధికారికంగా ప్రకటించి, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని(Farmer Compensation) కోరనుంది. రైతాంగ సంక్షేమం, ప్రజల తాగునీటి అవసరాల పరిరక్షణకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని బీజేపీ ప్రతినిధులు పట్టుబట్టనున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
