- పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు.. విజేతలకు బహుమతుల ప్రదానం
పెద్ద అంబర్పేట: పెద్ద అంబర్పేట పరిధిలోని కుంట్లూర్లో మల్ రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ వేడుకలను(Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలు అధిక సంఖ్యలో హాజరై, రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఆటపాటల మధ్య సందడి చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు జయప్రకాశ్ నగర్ కాలనీ మహిళలు ప్రధమ బహుమతి పొందడంతో కాలనీ బాధ్యులు లాల్ మహమ్మద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, జీఎస్ సేవా సమితి చైర్మన్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మరియు వారి కుమారుడు అభిషేక్ రెడ్డి సైతం వేడుకలలో పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకోవడంతో కుంట్లూర్లో పండుగ వాతావరణం నెలకొంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
