- కాంగ్రెస్ అధికార బలం..
- బీఆర్ఎస్ పునరాగమన వ్యూహం..
- బీజేపీ పట్టు.. జనసేన కొత్త ప్రయోగం
- పట్టభద్రుల తీర్పుపై ప్రధాన పార్టీల ఆశలు..
- ఓట్ల చీలిక ఎవరికి లాభం?
తెలంగాణ రాజకీయాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి రాజకీయ వేడిని(MLC Battle) పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీతో పాటు జనసేన రంగంలోకి దిగే సంకేతాలు కనిపిస్తుండటంతో పోటీ ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, ఓటర్ల మద్దతు ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి.
వరంగల్ – ఖమ్మం – నల్గొండ, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారంలో ఉన్నామనే ధీమాతో కాంగ్రెస్ ముందుకు సాగుతుండగా, కోల్పోయిన రాజకీయ ప్రాభవాన్ని తిరిగి సాధించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పట్టభద్రుల వర్గాల్లో తన పట్టును నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తుండగా, తెలంగాణలో రాజకీయ విస్తరణకు జనసేన ఈ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, వ్యక్తిగత ప్రతిష్ఠ, క్షేత్రస్థాయి పరిచయాలు కీలకంగా మారనున్నాయి.
కాంగ్రెస్.. అధికారాన్ని ఓట్లుగా మార్చుకుంటుందా?
రాష్ట్రంలో అధికారంలో ఉండటం కాంగ్రెస్‌కు ప్రధాన బలం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ పార్టీ విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ – ఖమ్మం – నల్గొండ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ స్థానం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.
రెండు స్థానాల్లోనూ విజయం సాధించడం ద్వారా పట్టభద్రుల్లో తమకు ఉన్న మద్దతును నిరూపించుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. అయితే అధికారంలో ఉండటం ఒక్కటే గెలుపునకు హామీ కాదు. ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు, ఉద్యోగులు – ఉపాధ్యాయుల డిమాండ్లపై పట్టభద్రుల అభిప్రాయాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ప్రభుత్వ పనితీరును సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, అసంతృప్తిని అధిగమించడం కాంగ్రెస్‌కు అసలు పరీక్షగా మారనుంది.

బీఆర్ఎస్.. బీసీ సమీకరణాలే విజయాస్త్రమా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Battle) తిరిగి పట్టు సాధించాలని భావిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించాలని గులాబీ పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్థానానికి సురభి వాణీదేవి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని వీరేష్ ముదిరాజ్‌కు అవకాశం కల్పించవచ్చనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే వ్యూహంతో పాటు, పట్టభద్రుల్లో అభ్యర్థికి ఉన్న పరిచయాలు, సంఘటిత మద్దతును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు వరంగల్ – ఖమ్మం – నల్గొండ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించాలని బీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతల్లో యువ నాయకుడు అనుగుల రాకేష్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని అధిగమించి, పట్టభద్రుల వర్గాల్లో పార్టీ బలాన్ని పెంచుకోవడం బీఆర్ఎస్కు కీలకం కానుంది. అయితే సామాజిక సమీకరణాలు మాత్రమే విజయాన్ని నిర్ణయించలేవు. అభ్యర్థి పనితీరు, పట్టభద్రులతో సంబంధాలు, నిరుద్యోగులు – ఉద్యోగుల సమస్యలపై పోరాటం, పార్టీ శ్రేణుల ఐక్యత కూడా ఫలితంపై ప్రభావం చూపనున్నాయి.
బీజేపీ.. ఆశావహులు ఎక్కువ.. టికెట్ ఎవరికి?
పట్టభద్రుల నియోజకవర్గాల్లో తన రాజకీయ పట్టును కొనసాగించాలని భావిస్తున్న బీజేపీలోనూ అభ్యర్థిత్వాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సుమారు 15 మంది ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.వారిలో మా…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
