- మృతదేహం స్వగ్రామానికి పంపేందుకు సాటా కృషి
సౌదీ అరేబియాలోని జిజాన్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో జగిత్యాల జిల్లా(Jagtial) కోరుట్ల మండలం యాకీనిపూర్ గ్రామానికి చెందిన కాశిరెడ్డి రాకేష్ మృతి చెందారు. రిగ్గర్గా పనిచేస్తున్న ఆయన విధుల్లో ఉండగా క్రేన్కు సంబంధించిన పైపు మీద పడటంతో మృతి చెందినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం, జెడ్డా కాన్సులేట్తో సమన్వయం చేస్తున్నారు. సాటా వ్యవస్థాపకులు మల్లేషన్, ఇతర కార్యవర్గ సభ్యులు రాకేష్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
