- వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అధికారుల సూచనలు
- యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం అక్టోబర్ 12
బీబీనగర్: రైతులు రాబోయే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటలను సాగు చేయాలని సీఎం, సీఎస్ సూచనల మేరకు బీబీనగర్ రైతువేదికలో క్లస్టర్ పరిధిలోని రైతులకు అవగాహన(El Niño Awareness) కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటూ, అందుకు అనుగుణంగా ఏయే పంటలు సాగు చేయాలనే అంశాలపై రైతులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు.వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటల ఎంపిక, సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, ఎంఎస్‌ఓ హరికృష్ణ, మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) పద్మ, సూపరింటెండెంట్ హరి శివకుమార్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, క్లస్టర్ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
