- తొలిరోజు దుర్గమ్మకు విశేష పూజలు.. భక్తిభావంతో భజనలు,గీతాలాపనలు
దేవీ నవరాత్రి ఉత్సవాలను (Devi Navaratri Celebrations) పురస్కరించుకొని కడ్తాల్‌లోని శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో తొలిరోజు దుర్గాదేవికి విశేష పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తిరునగరి శ్రీధర్ పంతులు ఆధ్వర్యంలో ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి దంపతులు తొలిరోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
నవరాత్రి ఉత్సవాల (Devi Navaratri Celebrations) తొలిరోజు ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.
భజనలు.. గీతాలాపనలతో ఆధ్యాత్మిక శోభ
ఈ సందర్భంగా భజన బృందం సభ్యులు భక్తిగీతాలు ఆలపిస్తూ భక్తులను ఆధ్యాత్మిక భక్తి భావంలో ముంచెత్తారు.భజనలు, గీతాలాపనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేవీ నవరాత్రి ఉత్సవాలను (Devi Navaratri Celebrations) భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గూడూరు జంగారెడ్డి, అర్చకులు శ్రీధర్ పంతులు, భజన బృందం సభ్యులు ఎగిరిశెట్టి బాబు, కూకుట్ల మల్లేష్,నేతి శ్రీశాంత్, సాయిరాం, వరుణ్, శ్రీకాంత్ లతో పాటు భక్తులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
