Homeమెదక్‌GPS Tracking | ట్రాక్టర్లకు జీపీఎస్‌.. ఇక కదలికలన్నీ రికార్డే!

GPS Tracking | ట్రాక్టర్లకు జీపీఎస్‌.. ఇక కదలికలన్నీ రికార్డే!

  • సొంత వాడకానికి చెక్
  • వాహనాలన్నీ అధికారుల కను సైగల్లోనే
  • సమయ పాలన పాటించకుంటే చర్యలే
  • వాహనాలకు జి పి ఎస్ బిగుస్తున్న అధికారులు

జగదేవపూర్: గ్రామపంచాయతీ పారిశుద్ధ్య ట్రాక్టర్ల నిర్వహణపై అధికారులు డిజిటల్‌ నిఘా పెంచారు. గ్రామపంచాయతీలకు చెందిన పారిశుద్ధ్య ట్రాక్టర్లకు జీపీఎస్‌ పరికరాలను(GPS Tracking) ఏర్పాటు చేశారు. దీంతో ట్రాక్టర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయి, ఏ ప్రాంతాల్లో తిరిగాయి, ఎంత దూరం ప్రయాణించాయనే వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. చెత్త సేకరణ, తరలింపు పనులను క్రమబద్ధీకరించడంతో పాటు ట్రాక్టర్ల అనవసర వినియోగం, ఇంధనం, సమయ వృథాను అరికట్టేందుకు ఈ విధానం దోహదపడుతుంది. పారిశుద్ధ్య నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకే జీపీఎస్‌(GPS Tracking) ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా గతంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ నీటి ట్యాంకర్ పర్యవేక్షణ లోపం వలన కొందరు ఆది వారి సొంత పనులకు కాకుండా నీటి ట్యాంకర్ లతో నీటిని సరఫరా చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులను వారి సొంత పనులకు ఖర్చు చేసుకున్నారే తప్ప ఏ ఒక్కటి కూడా పంచాయతీలో రికార్డులో నమోదు కాలేదని కానీ రికార్డుల్లో మాత్రం డీజిల్ ఖర్చులు పంచాయతీలో రికార్డుల లెక్కల్లో జెమచేసినట్టు తెలుస్తుంది. వీటినన్నింటినీ అరికట్టేందుకే గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు జిపిఎస్ ట్రాక్ ద్వారా వారి ఆటలకు చెక్ పడ్డట్టే. అన్నిటినీ పక్కకు పెట్టి గతంలో లాగే వాటిని సొంత పనులకు వినియోగిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలుస్తుంది.

- Advertisement -

పంచాయతీ ట్రాక్టర్లను వారి సొంత పనులకు ఉపయోగించుకొని గ్రామపంచాయతీ ఖర్చులో డీజిల్ బిల్లులను జమ చేయడంతో ప్రభుత్వ ధనం వృధా కావడం జరిగిందని వీటిని అరికట్టేందుకే ఈ జిపిఎస్ ట్రాక్లను అమర్చినట్లు తెలుస్తుంది. ఇలా చేయడం వలన పల్లెల్లో ప్రతీ రోజూ చెత్త సేకరణ , హరిత హారం ద్వారా నాటిన మొక్కలకు నీరు పోయడం వంటి పనులు సక్రమంగా జరుగుతాయని అంతేకాకుండా ట్రాక్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది అనే విషయాన్ని ఇట్టే అధికారులు పసిగట్టేందుకే జి పి ఎస్ ట్రాకర్ అమర్చినట్టు తెలుస్తుంది. ఇలా చేయడం ద్వారా డీజిల్ అంచనాతో పాటు పంచాయతీ ట్రాక్టర్ల దుర్వినియోగానీ చెక్ పడ్డట్టే.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News