- రోటరీ క్లబ్ ఆదర్శ సేవలు: పేద మహిళలకు కుట్టుమిషన్లు, ఆధునిక ఇస్త్రీ పెట్టెల పంపిణీ
- ఘనంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
- ‘ఉత్తమ ఉపాధ్యాయురాలు’ గడీల అన్నపూర్ణకు అపూర్వ సత్కారం
సదాశివపేట: కుటుంబానికి మూలస్తంభమైన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే కుటుంబంతో పాటు దేశం ప్రగతిపథంలో పయనిస్తుందని సదాశివపేట రోటరీ క్లబ్ నాయకులు పేర్కొన్నారు. స్థానిక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించి, వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.(Women Empowerment)
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు ఓదెల ప్రభు గుప్తా, పట్టణ కార్యదర్శి మఠం రాచన్న స్వామి మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా నిలబెట్టి సాధికారత సాధించే దిశగా చేయూతనందించడమే రోటరీ క్లబ్ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
ఉపాధి భరోసా – పరికరాల పంపిణీ:
ఉచిత కుట్టు మిషన్లు: ఆర్థికంగా వెనుకబడి, మహిళలపైనే ఆధారపడిన నిరుపేద కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కోసం ఉచితంగా కుట్టుమిషన్లను అందజేశారు. ఆధునిక ఇస్త్రీ పెట్టెలు: రజక వృత్తిని నమ్ముకుని పాతకాలపు బొగ్గు పెట్టెలతో ఇబ్బందులు పడుతున్న మహిళల శ్రమను తగ్గించేందుకు, సరికొత్త సాంకేతికతతో కూడిన ‘నయా ఐరన్ బాక్సులను’ పంపిణీ చేశారు.
ఉత్తమ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం:
ఇటీవల రాష్ట్రస్థాయిలో ‘ఉత్తమ ఉపాధ్యాయురాలు’ అవార్డు అందుకున్న క్లబ్ సభ్యురాలు శ్రీమతి గడీల అన్నపూర్ణను వేదికపై సభ్యులంతా శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కోశాధికారి వేణుగోపాల్ ముంద్రా, వినోద్ కుమార్, డైరెక్టర్లు మాశెట్టి ప్రవీణ్, పురం రజిని, బలరాం రాజు, తంగడపల్లి లక్ష్మణ్, శరత్ చంద్ర, బచ్చు సత్యనారాయణ, మధుసూదన్ చారి, రామచందర్, ప్రధానోపాధ్యాయులు సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
