Homeమెదక్‌Gandhi Jayanti​ | గాంధీజీ సిద్ధాంతాలే దేశానికి దిక్సూచి..

Gandhi Jayanti​ | గాంధీజీ సిద్ధాంతాలే దేశానికి దిక్సూచి..

  • కాంగ్రెస్‌తోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
  • మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు పిలుపు
  • సదాశివపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
    ​
    సదాశివపేట: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని(Gandhi Jayanti) పురస్కరించుకుని సదాశివపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

​ఈ కార్యక్రమంలో తొలుత మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ మాట్లాడుతూ.. “సత్యం, అహింస, శాంతి అనే ఆయుధాలతో ప్రపంచానికే స్వాతంత్ర్య పాఠాలు నేర్పిన యుగపురుషుడు మహాత్మా గాంధీ. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం, స్వయం సమృద్ధి, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సాధించడమే కాకుండా, ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చిరస్మరణీయం. సమాజంలో ద్వేషాన్ని వీడి ప్రేమానురాగాలు, శాంతి సౌభ్రాతృత్వాలతో మెలగాలన్న గాంధేయ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి. గాంధీజీ చూపిన మార్గంలోనే పట్టణ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నాం” అని ఉద్ఘాటించారు.

​అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ రేణుక చిరు మాట్లాడుతూ..

- Advertisement -

“సమాజంలో అసమానతలు పూర్తిగా తొలగిపోయి, మహిళలు, అట్టడుగు వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు సమానత్వంతో, గౌరవంగా జీవించాలన్నదే గాంధీజీ ప్రధాన ఆశయం. ఆ మహోన్నత ఆశయాలు, సిద్ధాంతాల పునాదులపైనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. లౌకికతత్వం, సర్వధర్మ సమభావం, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. గాంధీజీ బోధించిన నైతిక విలువలు, సేవా దృక్పథమే మాకు ఆదర్శం. ఆయన బాటలోనే నడుస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అంకితభావంతో పనిచేస్తాం” అని పేర్కొన్నారు.

​అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పట్లూరి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ సమైక్యతకు, సమగ్రతకు కాంగ్రెస్ పార్టీయే పట్టుకొమ్మ అని, గాంధీ మార్గంలో సైనికుల్లా పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యలపై పోరాటాలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌‌యూఐ (NSUI) నాయకులు, మహిళా నేతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News