Homeమెదక్‌World Tourism Day | మెతుకుసీమలో పర్యాటక సందడి..!

World Tourism Day | మెతుకుసీమలో పర్యాటక సందడి..!

  • 16 కళారూపాలతో మెదక్ లో భారీ ర్యాలీ
  • జెండా ఊపి ప్రారంభించిన మెదక్ కలెక్టర్
  • మెదక్ టూరిజం వెబ్ సైట్ ఆవిష్కరణ

మెదక్: ప్రపంచ పర్యాటక దినోత్సవం(World Tourism Day) సందర్భంగా మెదక్ జిల్లాలో ఆదివారం పర్యాటక శోభ వెల్లివిరిసింది. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని చాటిచెప్పేలా సుమారు 4 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ ఖిల్లాపై కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఖిల్లా సందర్శనార్థం టికెట్ కౌంటర్‌ను ప్రారంభించారు.

ఖిల్లా నుంచి వెస్లీ కళాశాల వరకు సాగిన ర్యాలీలో డప్పు, డోలు, చిందు, భాగవతం, బోనాలు, బతుకమ్మ, లంబాడీ, ఒగ్గు తదితర 16 కళారూపాల కళాకారులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని ఆకట్టుకున్నారు. గీత కార్మికులు, కరాటే బృందాలు, ఎన్‌సీసీ విద్యార్థులు సైతం పాల్గొన్నారు. అనంతరం వెస్లీ కళాశాలలో పర్యాటక రంగంపై ఏవీ ప్రదర్శించారు. శాంతి సందేశానికి ప్రతీకగా ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, కలెక్టర్, అదనపు ఎస్పీ, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు తెల్ల పావురాలను ఎగురవేశారు.

- Advertisement -

అనంతరం మెదక్ పర్యాటక రంగ అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. పర్యాటక రంగంపై విద్యార్థులు చదివిన కవిత, సినీగీత రచయిత సాయి సిరి పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.కార్యక్రమంలో డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో, టూరిజం అధికారి ఎల్లయ్య, ఆర్డీవో రమాదేవి, డీపీఆర్వో రామచంద్రరాజు, స్పోర్ట్స్ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ నవీన్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News