HomeతెలంగాణMahesh Kumar Goud | బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది..

Mahesh Kumar Goud | బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది..

  • సంచలన ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
  • కేంద్రం అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తోంది..
  • పౌరులకు నోటీసులు ఇస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు..
  • నిజామాబాద్ లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న మహేష్ కుమార్..

పౌరులకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ (Mahesh Kumar Goud) మహేష్ కుమార్ గౌడ్.. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. నిజామాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ డిమాండ్‌ చేసినట్టుగా ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. లేకపోతే వారిని ప్రభుత్వం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ దేశంలో పుట్టిన పౌరులకు, గతంలో పలుమార్లు ఓటు వేసిన వారికి కూడా నోటీసులు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలని అన్నారు. కాగా నిజామాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం అతిపెద్ద పండుగల్లో ఒకటని మహేశ్‌ కుమార్‌ చెప్పారు. గణనాథుడిని సాగనంపుతూ రాష్ట్రం వ్యవసాయం, ఆరోగ్యం, విద్య సహా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరుకున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా అందాలని ఆకాంక్షించారు. మరోసారి ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్‌కు ఉండాలని కోరుకున్నామని చెప్పారు.(https://epaper.aadabhyderabad.in/ \ https://www.youtube.com/@AadabHyderabadNews )

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News