Homeనల్లగొండMattampally | తహసిల్దార్ కార్యాలయం తరలింపుపై అఖిల పక్ష నాయకుల అభ్యంతరం

Mattampally | తహసిల్దార్ కార్యాలయం తరలింపుపై అఖిల పక్ష నాయకుల అభ్యంతరం

  • పాత తహసీల్దార్ స్థలంలోనే నూతన భవనం నిర్మాణం చేయాలి…
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకోవాలి…
  • మఠంపల్లి తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత…

మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో భవన నిర్మాణ స్థలం విషయంలో మాత్రం మండల ప్రజలు,అఖిల పక్ష నాయకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత కార్యాలయం ఉన్న ప్రాంతంలోనే నూతన భవనం నిర్మించకుండా, మండల కేంద్రానికి కిలో మీటర్ దూరంలో ఉండి,రాకపోకలు సరైన దారి లేని ప్రాంతానికి కార్యాలయాన్ని తరలించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్న సమయంలో మండల అఖిలపక్ష నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రస్తుత ప్రాంతంలోనే నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం మఠంపల్లి(Mattampally) ఎమ్మార్పీఎస్ జేఏసీ,అఖిలపక్ష నాయకులు కలిసి స్థానిక తహసీల్దార్‌ హిమ బిందుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కాంపాటి సందీప్ మాదిగ మాట్లాడుతూ ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం ఉన్న ప్రాంతానికి బదులుగా దూరంగా ఉండి కాలుష్యం వెదజల్లుతున్న ఇటుక బట్టీల సమీపంలో నూతన భవనం నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

- Advertisement -

అదే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసం కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యాలయం తరలింపుతో సామాన్య ప్రజలతో పాటు రైతులు, విద్యార్థులు,మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు రాకపోకల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రస్తుతం ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు పొందడం సులభంగా ఉందని తెలిపారు.తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా అదే ప్రాంతంలో కొనసాగిస్తూ నూతన భవనాన్ని నిర్మిస్తే ప్రజలకు పరిపాలనా సేవలు మరింత అందుబాటులో ఉంటాయని అన్నారు.

ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కార్యాలయాన్ని మరో ప్రాంతానికి తరలించడం అదనపు భారంగా మారుతుందని పేర్కొన్నారు.అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ నూతన భవనం నిర్మాణానికి ప్రజలకు అనుకూలమైన ప్రస్తుత ప్రాంతాన్నే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. స్థల ఎంపికపై ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా కార్యాలయ తరలింపు ప్రక్రియను కొనసాగిస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అవసరమయితే రిలే నిరాహార దీక్షలను పునుకుంటామని నాయకులు హెచ్చరించారు.

ఈ విషయంలో రాష్ట్ర నీటి పారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని మండల ప్రజల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత ప్రాంతంలోనే నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బచ్చలకూరి ప్రసాద్, జేఏసీ జిల్లా కార్యదర్శి, మఠంపల్లి(Mattampally) మాజీ ఉప సర్పంచ్ జాల కిరణ్,అఖిలపక్ష నాయకులు ఆరాల సైదులు,బాలు నాయక్,నందిపాటి సోమయ్య,రాజు,వివిధ సంఘాల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More Info (https://epaper.aadabhyderabad.in/), (Youtube)

https://aadabhyderabad.in/sangojiwadi-buffaloes-theft-police/
- Advertisement -
RELATED ARTICLES

Latest News