Homeఆదాబ్ ప్రత్యేకంSanskriti School | అక్రమాలకు కేరాఫ్‌గా సంస్కృతి స్కూల్..

Sanskriti School | అక్రమాలకు కేరాఫ్‌గా సంస్కృతి స్కూల్..

డీఈఓ సీజింగ్ ఆదేశాలు ఇచ్చిన స్కూల్ భవనం

  • కొండాపూర్, గోల్డెన్ తులిప్ లే అవుట్ లో అక్రమ స్కూల్ నిర్వహణ..
  • కార్పొరేట్ దోపిడీకి విద్యాశాఖ ఆశీస్సులు..?
  • సీబీఎసఈ నిబంధనలకు తిలోదకాలు
  • 600 మీటర్ల దూరం మాయాజాలం..
  • డీఈఓ ఆదేశాలను బుట్టదాఖలు చేసిన ఎంఈఓ..
  • కాసుల వేటలో కళ్ళుమూసుకున్న అధికారులు..
  • సమగ్ర విచారణ జరిపి కలెక్టర్ చర్యలు తీసుకోవాలి..
  • డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు..

విద్యను బోధించి భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు.. అక్రమాలకు ఆలవాలంగా మారిపోతుండటం ఆందోళన కలిగించే విషయం.. ఇలాంటి విద్యాసంస్థలు కోకొల్లలుగా వెలుస్తూనే ఉన్నాయి.. పైగా ఇలాంటి అక్రమ విద్యాసంస్థలను కట్టడి చేయాల్సిన సంబంధిత అధికారులు కాసుల వేటలో పడి కర్తవ్యాన్ని మరచిపోతున్నారు.. కొండాపూర్ గోల్డెన్ తులిప్ లేఅవుట్లో వెలుగు చూసిన ఓ అక్రమ వ్యవహారం ఇప్పుడు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.. ఆ వివరాలు చూద్దాం..

- Advertisement -

అధికారం, డబ్బు, రాజకీయ ప్రాబల్యం ఉంటే చాలు.. చట్టాలు, విద్యాశాఖ నిబంధనలు నీరుగారిపోతాయనడానికి కొండాపూర్ గోల్డెన్ తులిప్ లేఅవుట్‌లోని ‘సంస్కృతి స్కూల’ వ్యవహారమే సజీవ సాక్ష్యం. అఫిడవిట్ల అబద్ధాలు, అధికారుల గుడ్డి సంతకాలతో విద్యా వ్యవస్థను అంగడి సరుకుగా మార్చిన మాఫియా బండారం ఇది. 2010-2011లో కొండాపూర్ ‘గోల్డెన్ తులిప’ లేఅవుట్‌లోని ప్లాట్ నెం. 16, 16ఏ, 17 (సుమారు 950 గజాలు) పరిధిలో స్కూల్ నిర్వహణకు అనుమతి తీసుకున్నారు..

కానీ అక్కడికి దాదాపు 600 మీటర్ల దూరంలో ఉన్న ప్లాట్ నెం. 106 నుండి 117 వరకు ఉన్న విస్తీర్ణంలో సీబీఎసఈ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా అనధికారికంగా పాఠశాల నిర్వహణ జరుగుతోంది.. అయితే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఈ రెండు భూములను (మొత్తం 4,757.33 చదరపు మీటర్లు) ‘ఒకే కాంపౌండ్ వాల’ కలిగిన సింగిల్ ప్లాట్‌గా చూపించి సీబీఎసఈ, డీఈఓ, జీహెచఎంసీ, శానిటేషన్, ఫైర్ అధికారులకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు.. 2011లో మొదలైన ఈ మోసం, 2020లోనూ రెన్యువల్/ఎక్స్‌టెన్షన్ పేరుతో కొనసాగడం అధికారుల లంచగొండితనానికి పరాకాష్టగా నిలుస్తోంది.. పార్ట్-ఎ ఫారమ్‌లో పచ్చి అబద్ధాలు చూపించడం జరిగింది..

అలాగే పాయింట్ 13, 14లో స్కూల్, ప్లేగ్రౌండ్ ఒకే కాంపౌండ్ గోడలో ఉన్నాయా? అనగా “ఎస” అంటూ పచ్చి అబద్ధం. అలాగే పాయింట్ 19లో స్థలం గుండా పబ్లిక్ రోడ్డు, కాలువ, హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయా? అనగా “నో” అంటూ తప్పుడు సమాచారం అందించారు. అయితే జీహెచఎంసీ శానిటేషన్, ఫైర్, విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే కళ్ళు మూసుకుని సంతకాలు పెట్టడం వ్యవస్థీకృత అవినీతికి నిదర్శనం అన్నది స్పష్టం అవుతోంది..

Samskruthi School Kondapur Irregularities1

ఫిర్యాదుదారులు ఇచ్చిన వరుస ఫిర్యాదులు, ఎంఈఓ నివేదికల ఆధారంగా జిల్లా విద్యాశాఖ అధికారి సెప్టెంబర్ 2, 2026 నాటి లేఖలో సంచలన ఆదేశాలు జారీ చేశారు. అందులో అనధికారికంగా సాగుతున్న సంస్కృతి స్కూల్‌ను(Sanskriti School) తక్షణమే సీజ్ చేయాలని, మేనేజ్‌మెంట్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. కానీ, శేరిలింగంపల్లి మండలం ఎంఈఓ ఇప్పటివరకు ఈ ఆదేశాలను అమలు చేయకపోవడం, ఫ్రాంచైజ్ దోపిడీకి మౌనంగా సహకరించడం స్థానికంగా తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.

కాగా జాతీయ స్థాయి రాజకీయ నేతలు, పార్టీ పెద్దలతో సత్సంబంధాలను అడ్డుపెట్టుకుని స్కూల్ యాజమాన్యం చెలరేగిపోతోంది.. దారుణం ఏమిటంటే “అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే చర్యలు తీసుకులేకపోతున్నాం” అంటూ కిందిస్థాయి అధికారులు చేతులెత్తేయడం పాలకుల వైఫల్యానికి అద్దం పడుతోంది. పాత అధికారుల పాపాలను కప్పిపుచ్చేందుకే ఇప్పుడు కాలయాపన జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వేర్వేరు చోట్ల ఉన్న ప్లాట్లను సింగిల్ కాంపౌండ్ అని సర్టిఫై చేసిన, డీఈఓ సీజింగ్ ఆదేశాలు బేఖాతరు చేసిన ఎంఈఓపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు ఎందుకు జరపరు? సామాన్యులను చిన్న నిబంధనల పేరుతో వేధించే జీహెచఎంసీ అధికారులు, కోట్ల కార్పొరేట్ దందాను చూసి ఎందుకు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికైనా శేరిలింగంపల్లి పరిధిలోని అనధికార ఇంటర్నేషనల్/సీబీఎసఈ స్కూళ్లపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశిస్తారా? అన్నది వేచి చూడాలి..

కాగా మరో ముఖ్య విషయం విద్యారంగంలో 25 ఏళ్లకు పైగా అద్భుతమైన అనుభవం, విశ్వసనీయత కలిగిన ప్రముఖ సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పుడు కొంపల్లికి విస్తరించింది. ప్లేగ్రూప్ నుండి 10వ తరగతి వరకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించడం గమనార్హం.. కానీ 8 వ తరగతి వరకు కేవలం స్టేట్ సిలబస్ కు మాత్రమే అనుమతి ఉంది..

Samskruthi School Kondapur Irregularities

ఈ క్రమంలో సామాన్యుడికి ఒక న్యాయం.. రాజకీయ బలవంతులకు మరో న్యాయమా? క్షేత్రస్థాయిలో వాస్తవాలు తేల్చి, బాధ్యులైన యాజమాన్యంపై, అక్రమాలకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని సంచలన ఆధారాలతో ఎంఈఓ, డీఈఓ, కొండాపూర్ సంస్కృతి స్కూల్(Sanskriti School) మాఫియా బండారంపై మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

‘ఆదాబ్ హైదరాబాద’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’

- Advertisement -
RELATED ARTICLES

Latest News