ప్రాంతంలోనే ఎంతో విశిష్టత కలిగి, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతూ ప్రత్యేక గుర్తింపు పొందిన సదాశివపేట పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ చెన్నబసవేశ్వర మందిరంలో వినాయక నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయ ప్రాంగణంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ కలశ పూజ నిర్వహించి, అనంతరం మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో కలశాల ఊరేగింపును నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో కాలనీవాసులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కలశాలను ధరించారు. అనంతరం భక్తుల సమక్షంలో సామూహిక మహాన్యాసపూర్వక అభిషేక పూజలు, భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగాయి.Celebrations
ఆలయ అభివృద్ధిలో కమిటీ విశేష కృషి – భక్తుల కృతజ్ఞతలు:Celebrations
ప్రత్యేక గుర్తింపు కలిగిన ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడుతూ, ధార్మిక సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ శ్రీ చెన్నబసవేశ్వర ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్న అభివృద్ధి పనులు, నిరంతర సేవాకార్యక్రమాలు విశేషంగా నిలిచాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమష్టి కృషితో పకడ్బందీ ఏర్పాట్లు చేసి, ఇంతటి భారీ ఉత్సవాలు, అన్నదానాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు గాను భక్తులు, కాలనీవాసులు ఆలయ కమిటీ సభ్యుల విశిష్ట సేవలను కొనియాడుతూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
