- తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మాణిక్ రావు ఠాక్రే.. !
- పై చదువులకోసం విదేశాలకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్..
- నలుగురి పేర్లు పరిశీలిస్తున్న కాంగ్రెస్ హై కమాండ్..
- సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి..
- తెలంగాణతో పరిచయం సుదీర్ఘ అనుభవం ఠాక్రే సొంతం..
- గెలవాలంటే ముందు పార్టీ అంతర్గతంగా బలంగా ఉండాలి..
- పార్టీని ఐకమత్యంగా నిలపడం ఆయనకే సాధ్యమనే అభిప్రాయం..
- కొత్త ఇంచార్జ్ నియామకంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ..
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మళ్లీ తెరవెనుక చక్రం తిప్పే అనుభవజ్ఞుడి ప్రస్తావన తెరపైకి వచ్చింది. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలు, నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను మరోసారి మహారాష్ట్ర సీనియర్ నేత, ట్రబుల్షూటర్ మాణిక్ రావు గోవింద్ రావు ఠాక్రే చేతిలో పెట్టేందుకు ఏఐసీసీ తీవ్రంగా ఆలోచిస్తు న్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీని విజయపథం వైపు నడిపించడంలో ఆయన చూపిన సంయమనం, వ్యూహాత్మక పరిపక్వతను అధిష్టానం ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటు న్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో కనిపిస్తున్న ప్రతిష్ఠంభనను ఛేదించాలన్నా, క్యాడర్లో నిర్లిప్తతను తొలగించి యంత్రాంగాన్ని గాడిన పెట్టాలన్నా మృదుస్వభావి, క్రమశిక్షణ గల మాణిక్ రావు ఠాక్రే(Manikrao Thakare) లాంటి దిగ్గజ నేత మాత్రమే సరైన ప్రత్యామ్నా యమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం..
“తెలంగాణ కాంగ్రెస్‌లో(Telangana Congress)ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేప థ్యంలో ఏఐసీసీ మరోసారి అనుభవజ్ఞుడైన మాణిక్ రావు గోవింద్ రావు ఠాక్రేను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా” తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగు తోంది.. ఇదే నిజమైతే, తెలంగాణ కాంగ్రెస్‌లో .. అంతర్గత సమ న్వయం, నాయకుల మధ్య సయోధ్య, కార్యకర్తల్లో నమ్మకం, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై అధిష్టానం ప్రత్యే కంగా దృష్టి పెట్టినట్లుగా భావించవచ్చు. మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాణిక్ రావు గోవింద్ రావు ఠాక్రే ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మహారాష్ట్ర హోం మంత్రిగా, వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడు.
అంతేకాకుండా మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా పనిచేసిన సమయంలో, వివిధ వర్గాల నాయకులను సమన్వయం చేస్తూ, పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో(Telangana Congress) నెలకొన్న అనిశ్చితిని చక్కదిద్దడానికి మృదువుగా, క్రమశిక్షణతో వ్యవహరించగల నాయకుడి అవసరం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

మీనాక్షి నటరాజన్ విదేశీ పర్యటన :
ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కొత్త ఇంచార్జి బాధ్యతలపై అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు సీనియర్ నాయకుల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1. అశోక్ గెహ్లాట్.. 2. దిగ్విజయ్ సింగ్.. 3. ముకుల్ వాస్నిక్. అయితే వీరి భవిష్యత్ రాజకీయ బాధ్యతలు, రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఏఐసిసి స్థాయి బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ బాధ్యతలకు పంపే విషయంలో అధిష్టానం ఆలోచన చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో మాణిక్ రావు ఠాక్రే(Manikrao Thakare) పేరు ప్రాధాన్యత సంతరించు కుంటోంది. ఎందుకంటే..
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) రాజకీయ పరిస్థితులపై ఇప్పటికే అవగాహన ఉంది. గత ఎన్నికల సమయంలో పార్టీ అంతర్గత సమన్వయాన్ని చూశారు. తెలంగాణలోని నాయకత్వంపై వ్యక్తిగత పరిచయం ఉంది. పార్టీ సంస్థాగత వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అనుభవం ఉంది. సీనియర్ నాయకులతోనూ, కార్యకర్తలతోనూ సమన్వయం చేయగల సామర్థ్యం ఉంది. సమస్యలను తీవ్రతరం చేయకుండా పరిష్కరించే రాజకీయ శైలి ఉందనే అభిప్రాయం ఉంది. పార్టీని బలోపేతం చేయగల నాయకత్వమే ఇప్పుడు అవసరం. అందుకే మరోసారి తెలంగాణ బాధ్యతలను ఠాక్రేకు అప్పగించే ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం. ఠాక్రే ముందున్న అసలు సవాలు ఏమిటంటే.. పార్టీని ఎన్నికల మోడ్‌లోకి తీసుకురావడం! ఒకవేళ ఈ నియామకం జరిగితే, ఠాక్రే ముందున్న బాధ్యత కేవలం ఇంచార్జిగా వ్యవహరించడం కాదు. పార్టీని పూర్తిగా మార్చివేసి ఎన్నికలకు సిద్ధం చేయడం..
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మరో ముఖ్యమైన అంశం మంత్రి వర్గ ప్రక్షాళన. ఇప్పటికీ కొన్ని మంత్రి పదవులు భర్తీ కాకపోవడం, ప్రభుత్వం మూడేళ్ల దిశగా సాగుతున్న నేపథ్యంలో.. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయడం.. పనితీరు ఆధారంగా మార్పు లు చేయడం.. కొత్త వారికి అవకాశం కల్పించడం.. ప్రాంతీయ, సామాజిక సమతుల్యతను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఉప ముఖ్య మంత్రి పదవిని మాదిగ లేదా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది.
ఇక కార్యకర్తల చిరకాల డిమాండ్ నామినేటెడ్ పదవులు.. కాంగ్రెస్ కార్యకర్తల్లో చాలా కాలంగా ఉన్న ప్రధాన అసంతృప్తి.. “ఎన్నికల సమయంలో కార్యకర్త… అధికారం వచ్చిన తర్వాత మాత్రం గుర్తింపు ఎందుకు లేదు?” అనే ప్రశ్న. అందుకే నామినే టెడ్ పదవుల భర్తీకి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈసారి పార్టీ కోసం నిజంగా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
కొత్త పీసీసీ పీసీసీ అధ్యక్షుడు :
తెలంగాణ కాంగ్రెస్‌కు(Telangana Congress) కొత్త పీసీసి అధ్యక్షుడి ఎంపిక మరో కీలక అంశం. ఉత్తర తెలంగాణకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పదవి మాదిగ సామాజిక వర్గానికి ఇస్తే, పీసీసీ పదవిని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే సామాజిక సమతు ల్యత వ్యూహం కూడా పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ. ముఖ్యంగా బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు మరింతగా సమీకరించే దిశలో ఆలోచన జరిగితే.. ఆది శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో “అచ్చ కాంగ్రెస్ – పచ్చ కాంగ్రెస”. అనే విభజన మాటలకు ముగింపు పలికి…
ఒకే కాంగ్రెస్, ఒకే లక్ష్యం, ఒకే విజయం.. అనే నినాదంతో ముందుకు సాగాలి అనే ఆలోచన పార్టీని బలోపేతం చేయగలదు. కాగా కొత్త పీసీసి అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఉపాధ్యక్షులు.. ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు.. వంటి పార్టీ పదవులను కూడా పునర్వ్యవస్థీకరించి, కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అలాగే తెలుగు సినీ రంగంతో పాటు కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న ప్రముఖులుగా గుర్తింపు పొందిన సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికలే అసలు టార్గెట్! :
ఇక ముందున్న రాజకీయ కార్యాచరణలో.. జెడ్.పీ.టి.సి., ఎంపీటీసీ ఎన్నికలు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల బలోపేతం, గ్రామ స్థాయి క్యాడర్ సమీకరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు ప్రజా ప్రయోజన పథకాల రూపకల్పన పై ఆలోచిస్తున్నట్లు సమాచారం. అత్యంత ప్రజాదరణ పొందిన రాజీవ్ ఆరోగ్యశ్రీ..
తరహాలో ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ప్రజల్లో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. కాంగ్రెస్‌కు తెలంగాణలో అధికారం ఉంది. కానీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కంటే, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పెద్ద సవాలు. అందుకు నాయకత్వం ఎంత ముఖ్యమో.. కార్యకర్తల ఆత్మవిశ్వాసం అంతకంటే ముఖ్యం.
అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ముందున్న అసలు లక్ష్యం ఒక్కటే.. వర్గాలు కాదు కాంగ్రెస్.. పదవులు కాదు పార్టీ బలం! అంతర్గత విభేదాలు కాదు ఐక్యత! అధికారం కాదు ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ విజయం! ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన.. కాంగ్రెస్ విజయమే ధ్యేయంగా! రెండు మూడు రోజుల్లో ఇంచార్జి నియామకంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే సమాచారం నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ మార్పులు జరుగుతా యన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.(Youtube)
