నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ(Kalwakurthy Municipality), మండల ఎలక్ట్రీషియన్ల నూతన కమిటీని(New Electricians Committee) ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవర్ల పర్వతాలు, ఉపాధ్యక్షుడిగా రషీద్‌ఖాన్, గౌరవ అధ్యక్షుడిగా ఉస్మాన్ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శులుగా ఎం.డి. ఇంతియాజ్, గజ్జ ఆంజనేయులు గౌడ్, కోశాధికారిగా సాయిలు, సహాయ కార్యదర్శులుగా పి. మల్లేశం, అబూబకర్ ఎంపికయ్యారు. కమిటీ సభ్యులుగా జమీల్, ఇమ్రాన్‌ఖాన్, శాంతయ్య, రమేష్ ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారులుగా గన్నోజు బాబిదేవ్, ఎం.డి. అశ్వక్, నాని యాదవ్‌లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా పాత కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించి, వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి(Kalwakurthy Municipality) ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
