Homeస్పోర్ట్స్Jasprit Bumrah | అదిరిపోయిన బుమ్రా ఎంట్రీ..

Jasprit Bumrah | అదిరిపోయిన బుమ్రా ఎంట్రీ..

  • గాయాలనుంచి కోల్కొన్న స్టార్ బౌలర్..
  • ప్రాక్టీస్ లో యార్కర్లతో వైభవ్ కి చుక్కలు..

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) రీఎంట్రీ అదిరిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో బుమ్రా అదరగొట్టాడు. నెట్స్ లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తన బౌలింగ్‌తో గట్టి పరీక్ష పెట్టాడు. బుమ్రా వేసిన తొలి బంతి యార్కర్‌. సూర్యవంశీకి కాస్త దూరంగా వెళ్లింది. రెండో బంతికి మంచి లెంగ్త్‌తో బంతిని బయటకు మళ్లించి అతడిని పూర్తిగా బీట్‌ చేశాడు. మూడో బంతి మరో యార్కర్‌.

ఈసారి సూర్యవంశీ బ్యాట్‌ దించి బంతిని అడ్డుకున్నాడు. ఆ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) వేసిన బంతికి సూర్యవంశీ ఎడ్జ్‌ ఇచ్చాడు. వికెట్‌ కీపర్‌కు సులభంగా క్యాచ్‌ వెళ్లే బంతి కావడంతో బుమ్రా వెంటనే సంబరాలు చేసుకున్నాడు. ఎట్టకేలకు సూర్యవంశీ ఓ ఓవర్‌పిచ్‌ బంతిని బౌండరీకి తరలించాడు. మొత్తంగా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొన్న సమయంలో యువ బ్యాటర్‌ పెద్దగా దూకుడుగా ఆడలేకపోయాడు. బుమ్రా సుమారు 45 నిమిషాల పాటు పూర్తి తీవ్రతతో బౌలింగ్‌ చేశాడు.

- Advertisement -

చాలా కాలం తర్వాత నెట్స్‌లోకి వచ్చినా ఫిట్‌నెస్‌పై ఎలాంటి సందేహాలు లేకుండా కనిపించాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన బుమ్రాకు ఇది తొలి ప్రాక్టీస్‌ సెషన్‌. ఐపీఎల్‌లో గతంలో బుమ్రా బౌలింగ్‌లోనే సూర్యవంశీ సిక్సర్‌ కొట్టాడు. ఈసారి మాత్రం నెట్స్‌లో బుమ్రా పైచేయి సాధించాడు. ఢిల్లీ సెషన్‌లో బుమ్రా తీవ్రత చూసి భారత బ్యాటర్లు కూడా జాగ్రత్తగా ఆడినట్లు సమాచారం.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News