- వ్యాయామం షేక్ గా తీసుకొవడం అలవాటు..
- ఉదయం ఓట్స్ లో కలుపుకోవడం ఒక పద్ధతి..
ప్రస్తుతం ప్రోటీన్ పౌడర్లు(Protein Powder) కేవలం బాడీబిల్డర్లు, క్రీడాకారులు మాత్రమే ఉపయోగించే సప్లిమెంట్లుగా కాకుండా సాధారణ ఆహారంలోనూ భాగంగా మారుతున్నాయి. వ్యాయామం తర్వాత షేక్‌గా తీసుకోవడం, ఉదయం ఓట్స్‌లో కలుపుకోవడం వంటి పద్ధతుల్లో చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు. కండరాల పునరుద్ధరణ, బరువు నియంత్రణ, శక్తి పెంపు కోసం ప్రోటీన్ పౌడర్లు(Protein Powder) ఉపయోగపడతాయని చెబుతున్నప్పటికీ, వీటి భద్రత, మోతాదుపై అనేక అపోహలు ఉన్నాయి. ప్రోటీన్ పౌడర్లకు సంబంధించి సాధారణంగా వినిపించే పది అపోహలు, వాటి వెనుక ఉన్న వాస్తవాల గురించి నిపుణులు వివరిస్తున్నారు.
ప్రోటీన్ పౌడర్లు(Protein Powder) తీసుకుంటే ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో కిడ్నీలు దెబ్బతింటాయనేది ఒక సాధారణ అపోహ. అయితే కిడ్నీల పనితీరు సాధారణంగా ఉన్నవారు సిఫారసు చేసిన రోజువారీ పరిమితుల్లో ప్రోటీన్ లేదా ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకోవడం సాధారణంగా సురక్షితమే. అయితే ఇప్పటికే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారు మాత్రం ప్రోటీన్ తీసుకునే పరిమాణాన్ని తప్పనిసరిగా నియంత్రించాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన, చురుకైన వ్యక్తుల్లో సిఫారసు చేసిన పరిమితికి మించి ప్రోటీన్ తీసుకున్నా కిడ్నీల వడపోత సామర్థ్యం లేదా మొత్తం కిడ్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆధారాలు లేవని అధ్యయనాలు సూచిస్తున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)
