- గణేష్ చౌతితో పాటు అనేక పర్వదినాలు..
- ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న మాసం..
తెలుగు మాసాల్లో ఆరో మాసం భాద్రపద మాసం. భాద్రపద మాసం వినాయకుని ఆరాధనకు ప్రత్యేకం! వినాయక చవితితో పాటు పితృదేవతలకు విశేషమైన మహాలయ పక్షాలు, ఋషిపంచమి, అనంతపద్మనాభ వ్రతం, మాసశివరాత్రి ఈ మాసం ప్రత్యేకతలు!
తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసానికి చాలా ప్రత్యేకత ఉంది.
దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే భాద్రపద మాసం భక్తి, ఆత్మశోధన, ఆధ్యాత్మిక పునరుద్ధరణకు(Spirituality) పవిత్రమైన కాలం. ఇక ఈ మాసంలో ప్రతి తిథి విశిష్టమైనదే! ప్రతి రోజు పర్వదినమే! భాద్రపద మాసంలో పున్నమి చంద్రుడు ఉత్తరాభాద్ర లేదా పూర్వాభాద్ర నక్షత్రాలలో సంచరించడం వలన ఈ మాసానికి భాద్రపద మాసమని పేరు వచ్చింది. ఇక ఈ మాసంలో రానున్న పర్వదినాలు, పుణ్యతిథుల గురించి తెలుసుకుందాం.(https://epaper.aadabhyderabad.in/)
భాద్రపద మాసంలో పర్వదినాలు – పుణ్యతిథులు :
సెప్టెంబర్ 12, శనివారం నుంచి భాద్రపద మాసం ప్రారంభమై అక్టోబర్ 10, శనివారం వరకు భాద్రపద మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో రానున్న పర్వదినాలు, పుణ్యతిథులు ఇవే!
సెప్టెంబర్ 12, శనివారం భాద్రపద శుద్ధ పాడ్యమి/విదియ: భాద్రపద మాసం ప్రారంభం, చంద్రోదయం.
సెప్టెంబర్ 13, ఆదివారం భాద్రపద శుద్ధ విదియ/తదియ: వరాహజయంతి
సెప్టెంబర్ 14, సోమవారం భాద్రపద శుద్ధ చవితి: వినాయక చవితి, గణేష్ చతుర్థి, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిన వినాయక చవితి ఉత్సవం, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, శ్రీ మహాగణపతి వాక్యార్థ సభ ప్రారంభం.
సెప్టెంబర్ 15, మంగళవారం భాద్రపద శుద్ధ చవితి/పంచమి: ఋషి పంచమి, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం కార్యక్రమం, తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం, మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతి
సెప్టెంబర్ 17, గురువారం భాద్రపద శుద్ధ షష్టి: కన్యా సంక్రమణం, విశ్వకర్మ జయంతి
సెప్టెంబర్ 18, శుక్రవారం భాద్రపద శుద్ధ సప్తమి: తాళ్లపాక శ్రీ చెన్న కేశవస్వామి పవిత్రోత్సవాలు సమాప్తం
సెప్టెంబర్ 19, శనివారం భాద్రపద శుద్ధ అష్టమి: తిరుమల శ్రీవారి గరుడసేవ
సెప్టెంబర్ 20, ఆదివారం భాద్రపద శుద్ధ నవమి: తిరుమల శ్రీవారి రథరంగ డోలోత్సవం, శ్రీ కేదారేశ్వర వ్రతం
సెప్టెంబర్ 21, సోమవారం భాద్రపద శుద్ధ దశమి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం, జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు ప్రారంభం
సెప్టెంబర్ 22, మంగళవారం భాద్రపద శుద్ధ ఏకాదశి: తిరుమల శ్రీవారి రథోత్సవం, పరివర్తన ఏకాదశి, వామన జయంతి
సెప్టెంబర్ 23, బుధవారం భాద్రపద శుద్ధ ద్వాదశి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ అవభృథ స్నానం, చక్రస్నానం
సెప్టెంబర్ 24, గురువారం భాద్రపద శుద్ధ త్రయోదశి: పక్ష ప్రదోషం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు సమాప్తం
సెప్టెంబర్ 25, శుక్రవారం భాద్రపద శుద్ధ చతుర్దశి: అనంత పద్మనాభస్వామి వ్రతం, తిరుమల శ్రీవారి చక్రస్నానం, గణపతి నిమజ్జనం
సెప్టెంబర్ 26, శనివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి: ఉమామహేశ్వర వ్రతం
సెప్టెంబర్ 27, ఆదివారం భాద్రపద బహుళ పాడ్యమి: మహాలయ పక్షాలు ప్రారంభం
సెప్టెంబర్ 28, సోమవారం భాద్రపద బహుళ విదియ: శ్రీ మహాగణపతి వాక్యార్థ సభ సమాప్తం
సెప్టెంబర్ 29, మంగళవారం భాద్రపద బహుళ తదియ: బృహత్యుమా వ్రతం, ఉండ్రాళ్ల తదియ, మహాభరణి, సంకష్టహర చతుర్థి
అక్టోబర్ 2, శుక్రవారం భాద్రపద బహుళ షష్టి: మహాత్మాగాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.
అక్టోబర్ 3, శనివారం భాద్రపద బహుళ అష్టమి: మధ్వాష్టమి
అక్టోబర్ 6, మంగళవారం భాద్రపద బహుళ ఏకాదశి: జయ ఏకాదశి, ఇంద్రఏకాదశి
అక్టోబర్ 8, గురువారం భాద్రపద బహుళ త్రయోదశి: పక్ష ప్రదోషం, మాసశివరాత్రి
అక్టోబర్ 10, ఆదివారం భాద్రపద బహుళ అమావాస్య: మహాలయ అమావాస్య, పితృ దినం, బతుకమ్మ పండుగ ప్రారంభం, కుశ గ్రహణం. ఈ రోజుతో భాద్రపద మాసం సమాప్తం అవుతుంది.
