Homeఆదిలాబాద్Jayanti | ఘనంగా కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు.

Jayanti | ఘనంగా కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు.

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు(Jayanti Celebrations) బుధవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యేలా తెలంగాణ యాసలో ఎన్నో కవితలు రచించి, ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు.

కాళోజీ సేవలకు కేంద్ర ప్రభుత్వం 1992 లో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిందని చెప్పారు. ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కాళోజీ లాంటి గొప్ప వ్యక్తుల జయంతులను ఈ విధంగా అధికారికంగా నిర్వహించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇటువంటి మహనీయుల జయంతి ఉత్సవాల అధికారికంగా నిర్వహించడం ద్వారా భావితరాల వారికి వారి గొప్పతనాన్ని తెలియజెప్పిన వారిమవుతామని తెలిపారు.(epaper.aadabhyderabad.in)

- Advertisement -

ఈ జయంతి(Jayanti) వేడుకల్లో డిఆర్ఓ రాథోడ్ రమేష్, బిసి, ఎస్సీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, హార్టికల్చర్ అధికారి రమణ, ఎల్డిఎం రామ్ గోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News