- అభ్యంతరాలు,దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలి: అధికారులు
- అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు
- పాల్గొన్న తహశీల్దార్ జయశ్రీ, ఎంపీడీవో సుజాత నాయక్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల(Kadthal Mandal) కేంద్రంలో సోమవారం హియరింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలు ,దరఖాస్తులను అధికారులు నిశితంగా పరిశీలించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత ఆధారాలతో క్షుణ్ణంగా పరిశీలించి,నిబంధనల ప్రకారం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు.హియరింగ్‌లో పాల్గొన్న తహశీల్దార్ జయశ్రీ, ఎంపీడీవో సుజాత నాయక్ మాట్లాడుతూ..
అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.అదే సమయంలో అనర్హుల పేర్లు,డూప్లికేట్ ఓటర్లు,మరణించిన వ్యక్తుల పేర్లు, చిరునామా మారిన ఓటర్ల వివరాలను నిబంధనల(aadabhyderabad.in) మేరకు పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని ఆదేశించారు.ఓటరు జాబితా సవరణలో పారదర్శకత,నిష్పక్షపాతత్వం తప్పనిసరిగా పాటించాలని,ఎలాంటి ఒత్తిళ్లకు తావివ్వకుండా ఆధారాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

దరఖాస్తుదారులు సమర్పించే పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని,సందేహాస్పదంగా ఉన్న వివరాలపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్(SIR) ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా,దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటరు జాబితాలో తప్పులు లేకుండా తుది జాబితాను రూపొందించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ పుష్పలత,జీపీఓ ప్రవీణ్ కుమార్, బీఎల్ఓలు మంగమ్మ, భాగ్య,శైలజ, సిబ్బంది శ్రీకాంత్,నాయకులు క్యామ రాజేష్,తిరుమలేశ్వర్,దేవరి నర్సింగ్,మూడ అశోక్,లతీఫ్,పిప్పళ్ళ శ్రీశైలం, చెన్నమోని బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
