- టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భుజంగరావు.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితపై సోషల్ మీడియా( ఫేస్బుక్, ట్విట్టర్ ) వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ అనిల్ పై చర్యలు తీసుకోవాలని, అతనిపై కేసు నమోదు చేసి, అతని విధుల నుంచి తొలగించాలని కోరుతూ బుధవారం తాడ్వాయి మండల టిఆర్ఎస్ నాయకులు తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన ఒక పోలీసే ఇలా బాధ్యతారహితంగా ఓ మహిళా నాయకురాలి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భుజంగరావు, నాయకులు రాజేందర్ రావు, శేఖర్, యాదయ్య నాయకులు పాల్గొన్నారు
- Advertisement -
