- చెన్నైలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్
- తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల పరస్పర సహకారంపై సీఎంతో చర్చలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టడీ టూర్‌లో భాగంగా ఎంపీ చామల కిరణ్ రెడ్డి చెన్నై పర్యటనకు వెళ్లారు.
ఈ పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు కీలకమైన అంశాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు లోతుగా సమీక్షించి, చర్చించారు. ఈ అధికారిక సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. సీఎం విజయ్‌ను ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, భవిష్యత్ అభివృద్ధి తదితర ముఖ్యాంశాలపై ఇరువురు నాయకులు సానుకూలంగా చర్చించుకున్నట్లు సమాచారం
