వేములూరు ప్రాజెక్టుకు సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ యాతవాకిల్ల గ్రామ రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లుట్ల రఘును కలిసి తమ సమస్యను వివరించారు. వేములూరు ప్రాజెక్టుకు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరారు.రైతుల సమస్యపై స్పందించిన పిల్లుట్ల రఘు.. రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం సోమవారం రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. వేములూరు ప్రాజెక్టుకు నీరు అందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆర్డీవో అధికారికి వివరించి, వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు.రైతుల ఆందోళన, పిల్లుట్ల రఘు చొరవతో ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించారు.
పొనుగోడు ఎస్కేప్ నుంచి వేములూరు ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పిల్లుట్ల రఘుకు కృతజ్ఞతలు తెలిపారు.రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తే ఫలితం సాధించవచ్చని, రైతుల గోడుకు అండగా నిలవడమే తమ బాధ్యత అని పిల్లుట్ల రఘు పేర్కొన్నారు.
