- బేటి బచావో-బేటీ పడవోపై అవగాహన
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిలిపిచేడ్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం‘బేటీ బచావో–బేటీ పడావో’కార్యక్రమాన్ని నిర్వహించారు.రక్షాబంధన్‌ను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొని మండల స్థాయి అధికారులకు రాఖీలు కట్టారు.ఎంపీడీఓ ప్రశాంత్‌కు విద్యార్థులు రాఖీ కట్టి ఆడబిడ్డల రక్షణకు తమ వంతు బాధ్యతగా నిలుస్తామని తెలిపారు.ఈ సందర్భంగా‘బేటీ బచావో–బేటీ పడావో’కార్యక్రమం ఉద్దేశాలు,ఆడపిల్లల రక్షణ,విద్య ప్రాధాన్యతపై మండల స్థాయి అధికారులకు,విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బాల్యవివాహాలను అరికట్టాలని,బాలికలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని, అంతకుముందు వివాహం చేయకుండా ఉన్నత విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని పేర్కొన్నారు.అనంతరం‘బేటీ బచావో–బేటీ పడావో’ ప్రతిజ్ఞ చేయించారు.
ఆడపిల్లల రక్షణ,విద్య,హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రశాంత్,మండల స్థాయి అధికారులు,ఐసీడీఎస్ సూపర్వైజర్ సంతోషిమాత,అంగన్వాడీ టీచర్లు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
