Homeమెదక్‌Chilipched | విద్యుత్తు షాక్‌తో గేదె మృతి

Chilipched | విద్యుత్తు షాక్‌తో గేదె మృతి

చిలిపిచేడ్ మండల కేంద్రానికి చెందిన గొట్టం మనయ్యకు గేదె సోమవారం ఉదయం విద్యుత్తు షాక్‌తో మృతి చెందింది. చిలిపిచేడ్ గ్రామంలోని మోతుకుల శివారులోని పొలాల్లో మేత మేస్తూ వెళ్లిన గేదె సాయిరామ్ అనే రైతు పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ తీగకు తాకడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది.రూ.60 వేల విలువైన గేదె మృతి చెందడంతో మనయ్య బోరున విలపించారు.

తన జీవనాధారంగా ఉన్న గేదెను కోల్పోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.సమాచారం అందుకున్న ఆర్‌ఐ శ్రీహరి,పశువైద్య సిబ్బంది శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.నిబంధనల ప్రకారం బాధితుడికి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News