Homeఆదాబ్ ప్రత్యేకంAasritha Infra Projects | కోర్టు చెప్పినా కూల్చరా..?

Aasritha Infra Projects | కోర్టు చెప్పినా కూల్చరా..?

శంషాబాద్ జోనల్ కమిషనర్ గారూ హైకోర్టు ఆర్డర్‌ని అమలు పరచండి

  • జీఓ 111 రక్షణ భూముల్లో అక్రమ నిర్మాణాలు
  • ఆశ్రిత ఇన్‌ఫ్రా కట్టడాలను తక్షణమే కూల్చివేయాలి..
  • సంచలన ఆదేశాలు జారీచేసిన తెలంగాణ హైకోర్టు
  • 4 వారాల్లో పూర్తిచేయాలని గడువు విధించిన కోర్టు
  • ఆదేశాల కాపీలు అందించినా మౌనం ఎందుకు..?
  • జోనల్ కమిషనర్ చంద్రకళపై తీవ్ర ప్రశ్నల వర్షం
  • అధికారులపై రిట్ పిటిషన్ దాఖలు చేసిన బాధితుడు
  • అక్రమ నిర్మాణాల వెనుక అసలు సూత్రధారులు ఎవరు?

చెరువులు, తాగునీటి వనరుల పరిరక్షణకు ఉద్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు సాగుతున్నా.. అట్టి అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించినా.. శంషాబాద్‌లో మాత్రం పరిస్థితి మారలేదు. ఆదేశాల అమలులో జాప్యం ఎందుకు? అక్రమార్కులకు అండగా ఎవరు నిలుస్తున్నారు?

- Advertisement -

ఆ భూమి జీఓ 111 పరిథిలో వుంది.. చారిత్రాత్మక జీఓ పరిథిలో నిర్మాణాలు నిషిద్ధం.. కానీ ఈ నియమ నిబంధనలు ఎవరూ పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.. ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలను ఎవరూ ఖాతరు చేయడం లేదు.. చట్టాలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన ప్రభుత్వ అధికారుల్లో కొందరు అవినీతిపరులు అక్రమ నిర్మాణదారులకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.. దీనితో విలువల వలువలు అర్ధారంగా ఊడిపోతున్నాయి.. అక్రమార్జన ధ్యేయంగా సాగిపోతున్న అవినీతి అధికారుల తప్పిదాల వల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా గండి పడుతోంది..

ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటుపడుతున్నాయి.. మరీ దారుణం ఏమిటంటే సర్వోన్నత న్యాయస్థానాల ఆదేశాలను సైతం తుంగలో తొక్కడం.. అక్రమార్కులకు ప్రభుత్వం అన్నా.. నియమ నిబంధనలు అన్నా.. న్యాయస్థానాలు అన్నా ఎలాంటి గౌరవం ఉండటంలేదు.. కేవలం అక్రమ సంపాదన మాత్రమే వారికి ముఖ్యమైపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.. శంషాబాద్ లో వెలుగు చూసిన ఒక వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.. వివరాలు మీకోసం..

తాగునీటి జలాశయాల పరిరక్షణే ధ్యేయంగా జీహెచఎంసీ, పరిసర ప్రాంతాల్లో అమలులో ఉన్న చారిత్రాత్మక జీవో ఎంఎస్.నెం. 111, తేదీ: 08-03-1996 నిబంధనలను నిర్ధ్వందంగా తుంగలో తొక్కుతూ చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని అత్యంత విలువైన రక్షణ భూముల్లో చట్టాన్ని ధిక్కరించి నిర్మిస్తున్న కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు హై కోర్టు జారీ చేసింది.

అనుమతుల్లేవు.. నిబంధనలకు పాతర : శంషాబాద్ గ్రామం, శంషాబాద్ మండలం మౌజా పరిధిలోని సర్వే నంబర్లు 48, 49, 60, 61, 63, 84, 85, 86, 87, 88, 89లలో “ఆశ్రిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ” ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సుమారు 25 విల్లాలు 2, 676 గజాలలో.. దాదాపు 20 నుంచి 30 జీ ప్లస్ 1 విల్లాలు నిర్మిస్తూ.. సుమారు 4 నుంచి 4.5 కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.. న్యాయస్థానం ఇవి అక్రమ నిర్మాణాలని తేల్చి చెప్పిన తరువాత కూడా అధికారుల్లో చలనం లేకపోవడం శోచనీయం..

ఇక్కడ విల్లాలు కొనుక్కున్న వారి పరిస్థితి ఏమిటి..? రేపటి రోజున ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు గురైతే బాధ్యులు ఎవరు..? కొన్నవారికి ఎవరు న్యాయం చేస్తారు..? అంతే కాకుండా ఈ అక్రమ కట్టడాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే కాకుండా చెరువులు, తాగునీటి ప్రాజెక్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని బాధి తుడు జూన్ 29, 2026న సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు :

సంచలన తీర్పు ఇచ్చిన హై కోర్టు : అధికారుల ఉదాసీనతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భాస్కర్ రెడ్డి, న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు (రిట్ పిటిషన్ డబ్ల్యు పీ నెంబర్ : 25805/2026). ఈ పిటిషన్‌పై ఆద్యంతం లోతుగా విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, ఆగస్టు 6, 2026న కీలక మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. జీఓ 111 పరిధిలోని భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా వాటిని తక్షణమే అడ్డుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన కట్టడాలపై చట్టపరమైన కూల్చివేతల చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది.

న్యాయస్థానం విధించిన కీలక గడువులు : నోటీసు అందిన నాటి నుంచి సరిగ్గా నాలుగు వారాల వ్యవధిలో పిటిషనర్, నిర్మాణాలు చేపడుతున్న ‘ఆశ్రిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స’ ప్రతినిధులు, ఇతర సంబంధిత వ్యక్తులకు వ్యక్తిగతంగా విచారణ అవకాశం కల్పించి, మొత్తం విచారణ ప్రక్రియను ముగించాలని కోర్టు స్పష్టం చేసింది.

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ విల్లాలను తక్షణమే నేలమట్టం చేసి, ఆ వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని హెచ్చరించింది. కాగా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను బాధితుడు జీహెచఎంసీ జోనల్ కమిషనర్, హెచఎమ్‌డీఏ కమిషనర్, జీహెచఎంసీ సర్కిల్-18 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌లతో పాటు ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ‘హైడ్రా’ కమిషనర్‌కు నేరుగా అందజేశారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు జరగకపోవడం గర్హనీయం..

అయితే గతంలో బాధితుడు సదరు అక్రమ నిర్మాణం పై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు.. కానీ అధికారు లు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి ఆర్డర్లు కూడా తీసుకొచ్చాడు.. ఆ ఆర్డర్ కాపీలను సంబంధిత అధికారులకు కూడా అందజేశాడు.. కానీ అధికారుల్లో ఎలాంటి కదలిక కనిపిం చలేదు..

మరి జోనల్ కమీషనర్ చంద్రకళ హై కోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు..? ఎందుకు వెనుకం జవేస్తోంది..? ఆమెపై ఎవరినుంచైనా ఓత్థడిలు ఉన్నాయా..? లేక ఏమవుతుందిలే అన్న నిర్లక్షమా..? కోర్టు ఆర్డర్స్ అంటే లెక్కలేదా..? ఆమె పరిధిలో అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బ డిగా జరుగుతుంటే ఎందుకు కట్టడి చేయలేకపోతోంది..? ముడు పులు తీసుకుని మిన్నకుండిపోతోందా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

జీఓ 111 పరిధిలోని భూముల విక్రయాలు, అక్రమ నిర్మాణాలపై హైకోర్టు కఠినంగా ఉండటంతో అధికారుల తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను గాలికి వదిలేసి కోట్లాది రూపాయల మేర అక్రమ వ్యాపారం చేస్తున్న ‘ఆశ్రిత ఇన్ఫ్రా’ కట్టడాలను కూల్చివేస్తారా లేదా అనేది ఇప్పుడు స్థానిక ప్రజలు, పర్యావరణ వేత్తలలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కూడా కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వ్యవహారంలో అధికా రుల పాత్ర ఏమిటి..? ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తు న్నారు..? ప్రభుత్వ జీవోలు, నియమనిబంధనలు అంటే లెక్కలేదా..? దీని వెనుక వున్న అసలు సూత్రదారులు ఎవరు అన్న విషయాలపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది..

‘ఆదాబ్ హైదరాబాద’..మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News