Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | వంటింటి బడ్జెట్‌ను కుదిపేస్తున్న ధరల మంటలు

Aaj Ki Baath | వంటింటి బడ్జెట్‌ను కుదిపేస్తున్న ధరల మంటలు

అంటకాగుతున్న వంటనూనెలు.. భారీగా పెరిగిన వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, పప్పులతో పాటు కూరగాయల ధరలుభగ్గుమంటున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పరుగులు తీస్తున్నాయి. వంటింటి బడ్జెట్ను కుదిపేస్తున్న ధరల మంటలకు కారణాలు ఎన్నో.. పరిష్కారం మాత్రం అత్యవసరం. తక్షణ నియంత్రణ చర్యలే ప్రజలకు ఊరట.“మంట చిన్నదని నిర్లక్ష్యం చేస్తే.. ఇల్లు మొత్తం దగ్ధమవుతుంది” అన్నట్టుగా, నిత్యవసరాలు, కూరగాయల ధరల పెరుగుదలను అరికట్టకపోతే దాని ప్రభావం సామాన్య కుటుంబాల జీవనంపై మరింత తీవ్రంగా పడుతోంది.. వంటింటి పొయ్యి మీద మంట ఆహారాన్ని వండాలి.. కానీ కుటుంబాల ఆర్థిక భవిష్యత్తును కాల్చకూడదు. “అందుబాటు ధరలు -అందరికీ ఆహారం” అనే విధానంతో పాలన సాగితేనే సంక్షేమ రాజ్యానికి నిజమైన అర్థం. నిర్లక్ష్యం చేస్తే పాలకులకు గుదిబండగా మారొచ్చు- తస్మాత్ జాగ్రత్త!

  • మేదాజీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News