కన్నడ చిత్ర పరిశ్రమలో లెజెండ్ గా ప్రేక్షకాభిమానం పొందిన శాండల్ వుడ్ కింగ్ డా.శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “ఒరిజినల్ మాన్ స్టర్”. ఈ క్రేజీ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఆర్ చంద్రూ రూపొందిస్తున్నారు. ఆర్ సి స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆనంద్ పండిట్ సమర్పణలో యమున చంద్రూ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.



“ఒరిజినల్ మాన్ స్టర్” సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూస్తే – డబ్బు నింపిన బ్యాగుతో బుల్లెట్ బండి మీద వెళ్తూ చేతిలో కత్తితో శివరాజ్ కుమార్ ఫెరోషియస్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఆయన ఒంటిపై నెత్తుటి మరకలు, ఆయన వెళ్తున్న దారిలో డెడ్ బాడీస్ ఉండటం ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని తెలియజేస్తోంది. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ పై మరింతగా అంచనాలు పెంచుతోంది. పలు భారతీయ భాషల్లో “ఒరిజినల్ మాన్ స్టర్” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.




నటీనటులు – డా. శివరాజ్ కుమార్, సునీల్, తదితరులు
టెక్నీషియన్స్
————————–
ఆర్ట్ డైరెక్టర్ – శివకుమార్. జె.
కొరియోగ్రఫీ – చిన్ని ప్రకాష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్
డైలాగ్స్ – ఆర్ చంద్రు, మస్తి
ఎడిటర్ – గణేష్
సినిమాటోగ్రఫీ – ఎ జె శెట్టి
మ్యూజిక్ – బి.అజనీష్ లోక్ నాథ్
సమర్పణ – ఆనంద్ పండిట్
బ్యానర్ – ఆర్ సి స్టూడియోస్ ప్రొడక్షన్
ప్రొడ్యూసర్ – యమున చంద్రూ
స్టోరీ, డైరెక్షన్ – ఆర్ చంద్రూ
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
