తాడ్వాయి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శనివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్) తాడ్వాయి శాఖ ఆధ్వర్యంలో రాఖీ పండుగ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులలో సోదర భావం పెంపొందించే విధంగా బాలికలు, బాలురులకు రాఖీలు కట్టారు.


ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులలో సోదరి భావం పెంచేందుకు రక్షాబంధన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని స్కూల్ వయసు నుండి విద్యార్థులకు సోదర భావం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రక్షాబంధన్ అక్క,తమ్ముడు, అన్న, చెల్లి తో పాటు ఏ బంధమైనా ఒకరికొకరు రక్షణగా ఉండాలంటూ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కళ్యాణి,ఉపాధ్యాయులు, శేఖర్ నర్సారెడ్డి, సంగారెడ్డి, ఆర్ఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు.
