- మహారాష్ట్ర అంబర్ నాథ్ లో నెలకొన్న ఫ్యాక్టరీ..
- 61 వ బ్యాచ్ కింద అప్రెంటిస్ ల సెలక్షన్..
మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో ఉన్న మెషీన్ టూల్ ప్రొటోటైప్ ఫ్యాక్టరీ 61వ బ్యాచ్ కింద అప్రెంటిస్‌లను తీసుకోనుంది. 162 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా నాన్ ఐటీఐ, ఎక్స్ ఐటీఐ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 27లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ లోని ఒక శాఖ.
ఖాళీలు :
నాన్ ఐటీఐ ట్రేడ్ (Non ITI) అప్రెంటిస్ 83, ఎక్స్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ 79 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎంఎంటీఎం ట్రేడ్‌లలో భర్తీ చేస్తారు. అర్హతలు
నాన్ ఐటీఐ వారు కనీసం 50 శాతం మార్కులతో మాధ్యమిక్ (10వ తరగతి లేదా తత్సమానం) ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో 40 శాతం చొప్పున మార్కులు సాధించాలి. ఎక్స్ ఐటీఐ వారు NCVT/SCVT లేదా ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతి, ఐటీఐలో 50 శాతం మార్కులు సాధించాలి. అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక
నాన్ ఐటీఐ వారు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా (Merit List)ను తయారు చేస్తారు. మెరిట్ కమ్ చాయిస్ పద్ధతిలో ట్రేడ్‌లను కేటాయిస్తారు. ఎక్స్ ఐటీఐ వారు ట్రేడ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టును రూపొందిస్తారు. ఖాళీల ఆధారంగా తాత్కాలికంగా ఎంపిక చేసి డాక్యమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌ల కోసం పిలుస్తారు. వీటిలో సమానంగా వస్తే వయసులో పెద్దవారిని ఎంపిక చేస్తారు. వీటిలో సమానంగా ఉంటే పేరులోని అక్షర క్రమంలో ముందు వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
స్టైపెండ్
ఎంపికైన అభ్యర్థులు నాన్ ఐటీఐ ట్రేడ్ వారికి మొదటి ఏడాది రూ. 12,600, రెండో ఏడాది 14,400 ఇస్తారు. ఎక్స్ ఐటీఐ ట్రేడ్ వారికి మొదటి ఏడాది రూ. 14,400, రెండో ఏడాది రూ. 16,200 అందజేస్తారు.
దరఖాస్తు
దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, క్యాపిటల్ అక్షరాలతో నింపాలి. నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారంలో దరఖాస్తులను ‘The Chief General Manager, Machine Tool Prototype Factory, A Unit of AVNL, Govt. of India Enterprise, Ambarnath, Dist – Thane, Maharashtra, Pin: 421502 చిరునామాకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫారాన్ని AVNL వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
