Homeఆంధ్రప్రదేశ్Vijayasai Reddy | శ్రావణమాసం మూడో శుక్రవారం కొత్తపార్టీ..

Vijayasai Reddy | శ్రావణమాసం మూడో శుక్రవారం కొత్తపార్టీ..

  • ప్రకటించిన విజయసాయి రెడ్డి..
  • బలమైన స్వతంత్ర రాజకీయ వేదిక ఏర్పాటు..

తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి ఆయన ఈరోజు మరింత క్లారిటీ ఇచ్చారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు మరియు పూర్తి ప్రణాళికను విజయవాడ వేదికగా అధికారికంగా వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ప్రజాసమస్యలపై పోరాడేందుకు, ప్రజల తరఫున గొంతుక వినిపించేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఏమీ అవసరం లేదని విజయసాయి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మాత్రమే ఏకైక ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు. సాధారణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి సమస్యలను నేరుగా సభల వరకు తీసుకెళ్లేందుకు ఒక బలమైన స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News