- దేశీయ డిజిటల్ పేమెంట్స్ బలోపేతం..
- 2025-26 నాటికి రూ. 24,162 కోట్లకు చేరిన ట్రేన్జాక్షన్..
యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సేవలు అందుబాటులోకి వచ్చి పదేశ్లు అవుతోంది. 2016, ఆగస్టు 25వ తేదీన యూపీఐ లావాదేవీలను ప్రభుత్వం లాంచ్ చేసింది. డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో.. యూపీఐ దశాబ్ధ కాలాన్ని అందుకున్నది. దేశీయ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను బలోపేతం చేయడం యూపీఐ విధానం వెన్నుముకగా నిలుస్తోంది. 2016-17లో 1.78 కోట్లుగా ఉన్న వార్షిక యూపీఐ ట్రాన్జాక్షన్ వాల్యూమ్ .,. 2025-26 నాటికి 24,162 కోట్లకు చేరుకున్నది. దాదాపు 13 వేల రెట్లు లావాదేవీల సంఖ్య పెరిగిపోయిందని ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొన్నది. అయితే ఇదే సమయంలో.. ట్రాన్జాక్షన్ వాల్యూమ్ 0.07 నుంచి 314 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ట్రాన్జాక్షన్ వాల్యూ సుమారు 4వేల రెట్లు అధికంగా పెరిగినట్లు అంచనా వేశారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)ని 2016లో లాంచ్ చేశారు. ఆర్బీఐ ఆధీనంలో ఎన్పీసీఐ పనిచేస్తుంది.ఇక భారతీయ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో యూపీఐ ఓ ప్రత్యేక పేమెంట్ వ్యవస్థగా గుర్తింపు పొందింది. ట్రాన్జాక్షన్ వాల్యూమ్ 188 శాతం, ట్రాన్జాక్షన్ వాల్యూ 155 శాతం పెరిగినట్లు సీఏజీఆర్ ప్రకారం తెలిసింది. బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగ్గా ప్రదర్శించడం వల్ల యూపీఐ వ్యవస్థ కూడా వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. 2016లో యూపీఐ సేవలను కేవలం 44 బ్యాంకులు మాత్రమే ప్రారంభించాయని, కానీ జూలై 2026 నాటికి ఆ సంఖ్య 741కు చేరినట్లు తెలిసింది.
2026లో యూపీఐ ద్వారా సగటున రోజుకు సుమారు 66 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. భారత డిజిటల్ పేమెంట్స్‌లో 2025-26 సీజన్‌కు యూపీఐ షేర్ 84 శాతంగా నిలిచింది. యూపీఐ విధానం ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం పేమెంట్ సిస్టమ్‌గా గుర్తింపు పొందినట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి పేర్కొన్నది. ప్రస్తుతం యూపీఐ ప్లాట్‌ఫామ్ 11 దేశాల్లో ఆపరేషన్‌లో ఉన్నది. యూఏఈ, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషెస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవులు ఈ విధానాన్ని వినియోగిస్తున్నాయి. 2016 ఆగస్టు నెలలో యూపీఐ ద్వారా 90 వేల లావాదేవీలు జరిగాయి. ఇక 2026 మే నెలలో లావాదేవీల సంఖ్య సగటున 2300 కోట్లకు పెరిగిటన్లు అంచనా వేశారు
