- హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు..
తాడ్వాయి మండల దేమికలన్ గ్రామనికి చెందిన స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహేష్ బైక్ యాత్ర లో అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశారు. అయన బైక్ రైడ్ లో, ప్రపంచంలో అత్యంత ఎత్తైన రహదారుల్లో ఒకటైన ఉమ్లింగ్ లా పాస్ ను అయన అవరోదించారు. సముద్రమట్టానికి 19024 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వత శిఖరాన్ని అవరోధించడం ద్వారా ఆయన ఈ ఘనతను సాధించాను. ఈనెల 13న మొదలైన ఈ సాహస యాత్ర 19వ పూర్తి చేసుకున్నరు.

అత్యంత ప్రమాదకరమైన లోయలు, నిర్జీవమైన రహదారులు, ఒళ్ళు గగ్గులు పరిచే క్రాసింగ్లను, దాటుకుని ఆయన ఈ రికార్డును సాధించారు. తాడ్వాయి మండలం దేమికలన్ గ్రామానికి చెందిన ఎస్ఐ మహేష్ నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, 2004లో ఎస్సై ఉద్యోగం సాధించారు. ఆయన కేవలం శాంతి భద్రతలలే కాకుండా ఇలాంటి సాహసోపేతమైన, బైక్ రైడ్ చేసి గిన్నిస్ రికార్డు సాధించడం పట్ల అటు తాడ్వాయి మండల ప్రజలుతో పాటు సొంత గ్రామ ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.
