Homeస్పోర్ట్స్Karate | ఆసియా ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన తెలంగాణ కరాటే క్రీడాకారులు..

Karate | ఆసియా ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన తెలంగాణ కరాటే క్రీడాకారులు..

  • అభినందనలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్..

ప్రతిష్ఠాత్మక 2026 ఏకేఎఫ్ క్యాడెట్, జూనియర్ అండ్ యు – 21 ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌కు తెలంగాణకు చెందిన నలుగురు కరాటే క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ కరాటే – డూ అసోసియేషన్ అధ్యక్షులు, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ క్రీడాకారులను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సన్మానించి అభినందించారు.

జోర్డాన్‌లోని అమ్మాన్‌లో సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో విషాల్ రెడ్డి అమ్రాడి (- 61 కేజీ), సత్య తేజ బ్రహ్మాండాని (+ 66 కేజీ), నిష్ఠ గంగిసెట్టి (- 61 కేజీ), శశాంక్ సాత్విక్ లంకె (- 52 కేజీ) తెలంగాణ తరఫున పోటీపడనున్నారు. ఆసియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి తెలంగాణకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. క్రీడాకారుల తల్లిదండ్రులు, కోచ్‌లను కూడా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ హెడ్ కోచ్, కె IO జాయింట్ సెక్రటరీ కీర్తన్, కరాటే స్టేట్ జనరల్ సెక్రటరీ మల్యాల రామస్వామి, జాయింట్ సెక్రటరీ వెంకటేష్, కోచ్ నరేష్, ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News