- తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి సంజీవులు.
ఈనెల 24వ తేదీన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించే మెగా జాబ్ మేళా ను మండలంలోని యువతీ,యువకులు, సద్వినియోగం చేసుకోవాలని తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారు సంజీవులు కోరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో మదన్మోహన్ ట్రస్ట్ నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాలో 70 కి పైగా ప్రముఖ కంపెనీలు 5 వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నాయని పదో తరగతి, నుండి డిగ్రీ, బిటెక్, ఎంటెక్, అన్ని వర్గాల వారి కోసం ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఇందులో పాల్గొనాల్సిందిగా ఆయన సూచించారు.
ప్రతి ఒక్కరు వారి స్కిల్స్ తగ్గట్టుగా, వివిధ రంగాలలో బహుళ జాతీయ కంపెనీలతో సహా అన్ని రకాల కంపెనీలు సైతం, కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని ఇందులో పాల్గొని ఉద్యోగాలు, పొందాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.ఒక కుటుంబంలో ఒకరు ఉద్యోగం పొందుతే ఆ కుటుంబం ఆర్థికంగా నిలుదొక్కుకుంటుందని ఇలాంటి అవకాశాన్ని ఏ ఒక్కరు కూడా వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
