కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై ఆంజనేయులు 30వేల లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. రాజంపేట మండల కేంద్రం చెందిన సిమెంట్ షాపుల విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది ఈ గొడవలో ఇరు వర్గాలపై కేసు నమోదయింది. ఓ వర్గానికి చెందిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం ఎస్సై ఆంజనేయులు 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ముందుగానే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
గురువారం 30వేలు రూపాయలు ఇచ్చేందుకు ఎస్సే ఆంజనేయులు ఇంటికి వెళ్లి బాధితుడు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్సై ఆంజనేయులు అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అతని ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు .న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు ఆశ్రయిస్తే రక్షించాల్సిన పోలీసులే ఇలా లంచగొండి అవతారం ఎత్తుతుంటే తమ బాధ ఎవరికి చెప్పాలని ప్రజలు వాపోతున్నారు.
