Homeహైదరాబాద్‌Protest | పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఏబీవీపీ ఆందోళన

Protest | పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఏబీవీపీ ఆందోళన

తెలంగాణలో 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ సికింద్రాబాద్ జిల్లా, మారేడు పల్లి శాఖ ఆధ్వర్యంలో వెస్ట్ మారేడ్పల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ముందు బైఠాయించి రోడ్డుపై బైటాయించి విదార్థుల ధర్నా చేశారు. ప్రభుత్వానికి, సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ సిటీ సెక్రటరీ పృథ్వి తేజ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’ (Young India Skills University) పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, దీనికి సంబంధించిన జీవో నెం.97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు…

పాలిటెక్నిక్ విద్య కేవలం నైపుణ్య శిక్షణకు పరిమితమైన వ్యవస్థ కాదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నిపుణులను తయారు చేసే ప్రత్యేక సాంకేతిక విద్యా వ్యవస్థ అని అన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండే తక్కువ ఖర్చు సాంకేతిక విద్యకు పాలిటెక్నిక్ కళాశాలలు కీలక ఆధారంగా ఉన్నాయని పేర్కొన్నారు… సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో విలీనం చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు.

- Advertisement -

కళాశాలల్లో ఆధునిక ల్యాబ్‌లు, నూతన పరికరాలు, మెరుగైన మౌలిక వసతులు, సరిపడా బోధనా సిబ్బంది, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. డిప్లొమా విద్యార్థులకు ఉన్నత విద్యలో కొనసాగేందుకు ఉన్న లాటరల్ ఎంట్రీ అవకాశాలను మరింత బలోపేతం చేయాలని కోరారు…

విద్యా వ్యవస్థలో ఇలాంటి కీలక మార్పులు తీసుకువచ్చే ముందు విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాలు, సాంకేతిక విద్యా నిపుణులతో ప్రభుత్వం విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని దేవర్ల కార్తీక్ స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్య పేద విద్యార్థుల ఇంజనీరింగ్ కలలకు బలమైన పునాది. ఈ వ్యవస్థను బలహీనపరిస్తే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, కాబట్టి జీవో నెం.97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలి అని డిమాండ్ చేశారు.

ఆందోళన కారులు రోడ్డుకు ఎక్కడంతో ముందస్తు చర్యల్లో భాగంగా తుకారాంగేట్ పోలీసులు ఏబీవీపీ నేతలను అరెస్ట్ ఠాణాకు తరలించారు. ఈ కార్యక్రమంలో అభినయ్, జశ్వంత్, వికాస్, రేవంత్,మధు,వరుణ్,ఆశీర్, తో పాటు జశ్వంత్, ఆశీర్, ఆశిష్, అభిరామ్, వినయ్, కుమార్, వంశీ పెద్ద సంఖ్యలో పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News