Homeఆరోగ్యంSleep Tips | ఈ టిప్స్ పాటించండి..

Sleep Tips | ఈ టిప్స్ పాటించండి..

  • మీరు వద్దన్నా నిద్ర తన్నుకుని వస్తుంది..
  • వ్యాయామం చేయడం కూడా ఎంతో ప్రయోజనం..

ఆరోగ్యంగా ఉండడానికి తగినంత నిద్ర ఎంతో అవసరం. అయితే వృత్తిపరమైన ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, శారీరక శ్రమ తక్కువగా ఉండే జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాలతో చాలామందిలో నిద్ర విధానం దెబ్బతింటోంది. సాధారణంగా రోజుకు 8 గంటల నిద్ర ఆరోగ్యానికి మంచిదిగా వైద్యులు చెబుతుంటారు. కానీ ప్రస్తుత జీవనశైలిలో ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవడం చాలామందికి సాధ్యం కావడం లేదు. తగినంత నిద్ర లేకపోవడం లేదా నిద్ర సమయాల్లో తరచూ మార్పులు రావడం వల్ల స్వల్పకాలికంగానే కాకుండా దీర్ఘకాలంలోనూ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.

చిరాకు, ఏకాగ్రత తగ్గడం, మెదడు పనితీరుపై ప్రభావం, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్‌కు కూడా దారితీస్తోంది. రాత్రి పడుకునే ముందు ఎక్కువగా తినడం లేదా పడుకునే సమయానికి చాలా దగ్గరగా భోజనం చేయడం వల్ల గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు వ‌స్తాయి. దీంతో నిద్రపోవడం కష్టంగా మారుతుంది. అందువల్ల రాత్రివేళ పడుకునే ముందు అతిగా తినడం, మధ్యలో అనవసరంగా స్నాక్స్‌ తీసుకోవడం వంటివి తగ్గించుకోవాలి.

- Advertisement -

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం వంటి క్రమబద్ధమైన నిద్ర అలవాటును పాటించడం కూడా ముఖ్యమే. వారాంతాల్లో కూడా నిద్ర సమయాన్ని ఎక్కువగా మార్చకుండా చూసుకోవడం వల్ల శరీరంలోని జీవ గడియారం క్రమబద్ధంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ, కొద్దిగా యాలకులు, మెత్తగా చేసిన బాదం కలిపి తీసుకోవడం మేలు చేస్తుంది. అలాగే పాలు, నీరు, తాజా వెల్లుల్లి కలిపి మరిగించి తయారు చేసిన వెల్లుల్లి పాలను తీసుకోవచ్చు.

చెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే ఒక కప్పు తాజా టమాటా రసంలో రెండు టీస్పూన్ల చక్కెర, చిటికెడు జాజికాయ కలిపి సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో తీసుకుని, రాత్రి భోజనాన్ని ముందుగానే ముగించాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News