Homeసాహిత్యంSilence | మౌన భాష

Silence | మౌన భాష

నీ ప్రతి గెలుపు..
ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది
నీ ఒక్కొక్క ఓటమి..
కసి, కృషిని బలోపేతం చేస్తుంది !

విజయాన్ని తలకెక్కించకు
ఓటమిని అంగీకరించకు
రేపటి జయానికి ఇంధనం..
నేటి ఓటమి నేర్పిన గుణపాఠం !

- Advertisement -

వెలుతురు ఎప్పుడూ ఉండవద్దు
చీకటి కూడా ముఖ్యమే కదా
గెలుపోటములు కూడా అంతే మరి..
ఈ రెండే జీవితమని తలచుకో !

నీ పట్ల సమాజ మౌన భాష కూడా..
నీకు ఎంతో జ్ఞానాన్ని నేర్పుతుంది
జ్ఞానం ఉండీ ఎదగని వాడు..
అజ్ఞాని కన్న అధముడే కదా !

- Advertisement -
RELATED ARTICLES

Latest News