Homeనిజామాబాద్‌Celebrations | ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.

Celebrations | ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ జన్మదిన వేడుకలు శనివారం మండలంలోని పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు,ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని బ్రహ్మాజీ వాడి, చందాపూర్, చిట్యాల్,దేవయపల్లి, తాడ్వాయి, తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా బ్రహ్మాజీ వాడి, చందాపూర్, తాడ్వాయి, ఎర్ర పహాడ్, గ్రామాలలో పాఠశాలను విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పండ్లు పంపిణీ చేశారు. తాడ్వాయి పార్టీ కార్యాలయంలో నాయకుల కార్యకర్తలు, కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు.

yellareddy mla madan mohan birthday celebrations

ఈ సందర్భంగా మండల అధికార అధ్యక్షుడు బండారి సంజీవ్ మాట్లాడుతూ తమ నాయకుడు మదన్మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకుడని, ఐ కమాండ్ తో ఆయనకున్న మంచి పరిచయాలతో నియోజకవర్గానికి భారీగా నిధులు తెచ్చి, అభివృద్ధి చేస్తున్నాడన్నారు. తమ నాయకుడి పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.

- Advertisement -
yellareddy mla madan mohan birthday celebrations2

తమ ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్బంగా పలువురు కార్యకర్తలు, గుడిలలో ప్రత్యేక పూజలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి షావకత్ అలీ, యూత్ అధ్యక్షుడు, అఖిల్ రావు, తాడ్వాయి గ్రామ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు గైని శివాజీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజలింగం, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News