Homeహైదరాబాద్‌Yatra | గీత కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా చైతన్యయాత్ర

Yatra | గీత కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా చైతన్యయాత్ర

గీత కార్మికుల సంక్షేమం, ఉపాధి పరిరక్షణ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘గీతన్నల చైతన్యయాత్ర’ నిర్వహించనున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…

మహబూబాబాద్ (మానుకోట) నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర అన్ని జిల్లాల్లో పర్యటించి ఆగస్టు 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ముగుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కోటి తాటి, ఈత వృక్ష సంపదపై సుమారు ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్న నాయకులు, గీత కార్మికుల భద్రత కోసం కాటమయ్య రక్షణ కవచాలను తక్షణమే అందించాలని కోరారు.

- Advertisement -

అలాగే కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు గీత కార్మికుల పెన్షన్‌ను రూ.4వేల కు, ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చైతన్యయాత్రను విజయవంతం చేయడానికి గీత కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణా స్వామి, వెంకట నర్సయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News